Chennai: వీళ్లు మాములు దొంగలు కాదురా బుజ్జీ.. బంగారం, వజ్రాలు కొట్టేసి ఎక్కడ నక్కారో తెల్సా..?

|

Nov 26, 2022 | 3:01 PM

చెన్నై శివారులో సినిమా స్టైల్ లో బంగారం, వజ్రాలను అపహరించారు దొంగలు. సీసీ విజువల్స్ ఆధారంగా పోలీసులు విచారణ జరిపి.. నిందితులను గంటల వ్యవధిలో పట్టుకున్నారు.

Chennai: వీళ్లు మాములు దొంగలు కాదురా బుజ్జీ.. బంగారం, వజ్రాలు కొట్టేసి ఎక్కడ నక్కారో తెల్సా..?
Robbery at Blue stone jewelry store
Follow us on

సినీ ఫక్కీలో దొంగతనానికి పాల్పడ్డారు యువకులు. బిల్డింగ్ వెనుక భాగంలోని పైప్ ద్వారా లోపలి ప్రవేశించారు. కట్టర్స్ తో కిటికి ని కట్ చేసి నగల దుకాణంలోకి చొరబడ్డారు. కోటిన్నర విలువైన వస్తువులను దొంగిలించారు. షోరూం ఎదురుగా ఉన్న రూమ్ లో తలదాచుకున్నారు. ఈ ఘటన చెన్నై లోని తాంబరంలో గల ప్రముఖ నగల దుకాణం బ్లుస్టోన్స్ లో జరిగింది.

ఉదయాన్నే షోరూం తెరిచిన సిబ్బంది బంగారం, వజ్రాలు చోరికి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ విజువల్స్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. షోరూంకు ఎదురుగా ఉన్న రూమ్ లోనే నిందితులు దాక్కున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులు అస్సాం యువకులుగా గుర్తించారు. ముగ్గురి నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దొంగతనం జరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీ అలారం మోగినా.. సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. నగలు కొట్టేసిన వెంటనే వెళ్లిపోకుండా ఎదురుగా ఉన్న రూమ్ లో దాక్కుకోవడం.. అలారం మోగిన సెక్యూరిటీ పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..