Chandigarh Firing: కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం. అల్లుడిని కాల్చి చంపిన మామ..!

|

Aug 03, 2024 | 4:56 PM

చండీగఢ్ కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. వివాహ వివాదంపై రెండు పార్టీలు ఫ్యామిలీ కోర్టుకు వచ్చాయి. ఈ సమయంలో, పంజాబ్ పోలీస్ మాజీ AIG మల్వీందర్ సింగ్ సిద్ధూ తన అల్లుడిపై కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు.

Chandigarh Firing: కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం. అల్లుడిని కాల్చి చంపిన మామ..!
Chandigarh Firing
Follow us on

చండీగఢ్ కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. వివాహ వివాదంపై రెండు పార్టీలు ఫ్యామిలీ కోర్టుకు వచ్చాయి. ఈ సమయంలో, పంజాబ్ పోలీస్ మాజీ AIG మల్వీందర్ సింగ్ సిద్ధూ తన అల్లుడిపై కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ హఠాత్తు పరిణామంతో షాక్ అయిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి IRS అధికారి హర్‌ప్రీత్ సింగ్ వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు మల్లీందర్ సింగ్ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఐదుసార్లు కాల్పులు జరిపాడు. వీటిలో రెండు బుల్లెట్లు యువకుడికి తగిలాయి. లోపల గది తలుపుకు మరో బుల్లెట్ తగిలింది. బుల్లెట్ శబ్దం వినగానే కోర్టులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న న్యాయవాదులు నిందితుడిని పట్టుకుని గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు.

దీని తరువాత, గాయపడిన IRS అధికారి హర్‌ప్రీత్ సింగ్‌ను సెక్టార్ 16 ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అతను మార్గమధ్యంలో మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని గదిలో బంధించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మధ్యవర్తిత్వం కోసం ఇరు కుటుంబాలు జిల్లా కోర్టుకు చేరుకున్నాయి. అయితే హర్‌ప్రీత్ సింగ్‌ను అతని మామ హత్య చేశాడు. కోర్టులో ఘటన జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. హర్‌ప్రీత్ తన భార్యతో వైవాహిక వివాదంలో చిక్కుకున్నాడు. కేసు విచారణ కోసం జిల్లా కోర్టుకు చేరుకున్నాడు. ఈ కేసులో ఇది మూడో ఆర్బిట్రేషన్ విచారణ అని పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే, తన పదవిని దుర్వినియోగం చేయడంతో ఇటీవలె మల్వీందర్ సింగ్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. మోసం, బ్లాక్‌మెయిల్, బలవంతపు వసూళ్లు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి లంచం తీసుకున్నందుకు పంజాబ్ పోలీసు మానవ హక్కుల విభాగం అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ మల్వీందర్ సింగ్ సిద్ధూపై గతేడాది నవంబర్‌లో పంజాబ్ విజిలెన్స్ బ్యూరో కేసు నమోదు చేసింది. ఇక తాజాగా మల్వీందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..