BJP: ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..

|

Jul 22, 2024 | 3:25 PM

బీజేపీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. 58 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో చేరడాన్ని స్వాగతించింది. ఇప్పటి వరకూ ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేస్తూ జూలై 21న ఆదివారం సంచలన నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆల్ ఇండియా పబ్లిసిటీ చీఫ్ సునీల్ అంబేకర్ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

BJP: ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
Rss
Follow us on

బీజేపీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. 58 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో చేరడాన్ని స్వాగతించింది. ఇప్పటి వరకూ ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేస్తూ జూలై 21న ఆదివారం సంచలన నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆల్ ఇండియా పబ్లిసిటీ చీఫ్ సునీల్ అంబేకర్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్ గత 99 సంవత్సరాలుగా దేశ పునర్నిర్మాణం కోసం సమాజ సేవలో నిమగ్నమై ఉందన్నారు. సంఘ్ జాతీయ భద్రత, ఐక్యత, సమగ్రత కోసం పాటు పడుతుందని వివరించారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో సమాజం కోసం పనిచేసిందని కొనియాడారు. ఈ విశేష కృషికి ఇప్పుడు ప్రశంసలు లభించాయన్నారు. అలాగే గత కాంగ్రెస్ పాలనాతీరును విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా అప్పటి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు.

1966లో నిషేధం..

గతంలో కేంద్ర ప్రభుత్వం 1966, 1970, 1980 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ లో చేరడాన్ని నిషేధించింది. కొన్ని కఠిన నిబంధనలను కూడా విధించింది. దీన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తొలగించి తాజా ఉత్తర్వులను వెలువరించింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మరోవైపు ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. భారతదేశ సమగ్రత, ఐక్యతకు ఇది వ్యతిరేకమన్నాయి. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ, “అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కూడా 58 ఏళ్ల నిషేధాన్ని 2024 జూలై 9న ఎత్తివేశారన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..