Telecom: BSNL యూజర్స్‌కు గుడ్ న్యూస్‌.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..

|

Jul 27, 2022 | 10:28 PM

ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ అయిన BSNL కేంద్రం ఊపిరి ఊదింది. బీఎస్‌ఎన్ఎల్ మనుగడ సాగించడం కోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని అనౌన్స్ చేసింది.

Telecom: BSNL యూజర్స్‌కు గుడ్ న్యూస్‌.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..
Bsnl
Follow us on

BSNL Package: తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. మారుమూల ప్రాంతాల్లో 4 జీ నెట్‌వర్క్‌ విస్తరణకు కేంద్రం ఈ కీలక చర్యలు తీసుకుంది. BSNL 4 జీ సేవలను పటిష్టం చేసేందుకు భారీ ప్యాకేజ్‌ను ప్రకటించింది మోదీ సర్కార్. లక్షా 64 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. అంతేకాదు BSNL , BBNL సంస్థల విలీనానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేంద్రం నిర్ణయంతో రానున్న రెండేళ్లలో BSNL దేశంలో టాప్‌ టెలికాం కంపెనీగా నిలుస్తుందన్నారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌. ప్యాకేజీలో 43 వేల 964కోట్ల రూపాయల నగదు మద్దతు, 1.20లక్షల కోట్ల నగదు రహిత మద్దతు ఉంటుందని చెప్పారు ఐటీ మంత్రి. కేంద్రప్రభుత్వ నిర్ణయం BSNL అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు మంత్రి అశ్విని వైష్ణవ్. అలాగే యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ద్వారా 26 వేల 316 కోట్ల రూపాయల ఖర్చుతో దేశంలోని అన్ని మారుమూల గ్రామాలకు 4జీ సేవల విస్తరణకు సైతం కేంద్రం కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు. దీంతో ఇప్పటి వరకు కొన్ని పట్టణాలకే పరిమితమైన 4జీ సేవలు గ్రామాలకు చేరనున్నాయి. 4జీతోపాటు 5జీ సేవలకు వీలుగా BSNLకు స్పెక్ట్రమ్ కేటాయింపులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..