International Flights: ఈ ఏడాది చివరికి అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు సాధారణ స్థాయికి

|

Nov 24, 2021 | 9:12 PM

ఈ ఏడాది చివరి నాటికి అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్ బుధవారం తెలిపారు.

International Flights: ఈ ఏడాది చివరికి అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు సాధారణ స్థాయికి
International Flights
Follow us on

International Flights: ఈ ఏడాది చివరి నాటికి అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్ బుధవారం తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చిలో షెడ్యూల్ అయిన అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలు నిలిపివేశారు. అయితే, పరిమితుల సడలింపు.. కరోనా వ్యాక్సినేషన్ కవరేజీని పెంచడంతో, భారతదేశం కొన్ని దేశాలతో ఎయిర్ బబుల్ అమరికలో విమానాలను ప్రారంభించింది. ప్రస్తుతం, భారతదేశం యూఎస్(US),యూకే(UK),యూఏఈ(UAE) సహా 31 దేశాలతో ఎయిర్ బబుల్ ఏర్పాట్లు కలిగి ఉంది.

సింధియా ఏమన్నారంటే..

పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ”నేను షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను పునఃప్రారంభించే అంశంపై హోం, ఆరోగ్యం వంటి ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలతో కలిసి పని చేస్తున్నాను. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసుల పునరుద్ధరణ కారణంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మంత్రిత్వ శాఖల మధ్య జరిగిన చర్చలో త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తుందని ఆశిస్తున్నాం.” అని తెలిపారు.

దేశీయ విమానాలు పూర్తి సామర్థ్యంతో ప్రయాణించడానికి అనుమతించారు. అంతర్జాతీయ విమానాల మాదిరిగానే, లాక్డౌన్ సమయంలో దేశీయ విమానాలు కూడా నిషేధించారు. అయితే, రెండు నెలల విరామం తర్వాత, పరిమిత సామర్థ్యంతో దేశీయ విమాన కార్యకలాపాలు మే 2020లో ప్రారంభించారు. గత నెలలో మాత్రమే దేశీయ విమానాలు పూర్తి సామర్థ్యంతో ప్రయాణించడానికి అనుమతి పొందాయి.

రోజుకు 4 లక్షల మంది ప్రయాణికులు..

కరోనా రాకముందు, ఒక రోజులో 4 లక్షల మంది ప్రయాణికులు డొమెస్టిక్ రూట్‌లో ప్రయాణించేవారు. 2020 మే 25న విమానలు తిరిగి ప్రారంభమైనతరువాత రోజుకు 30 వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సర్వీసులు నవంబర్ 30 వరకు నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి: Hira Horse: వామ్మో.. ఈ ఖరీదైన గుర్రం ఎన్ని లీటర్ల పాలు తాగుతుందో తెలిస్తే గుండెలదిరిపోతాయి!

Smriti Irani: మిస్ ఇండియా కాలేకపోయారు..ప్రజల మనసులు కొల్లగొట్టారు..కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జీవితంలో ఆసక్తికర మలుపులు!

Antarctica: అంటార్కిటికా మంచుపై తొలిసారిగా దిగి చరిత్ర సృష్టించిన ఎయిర్ బస్ ఏ 340 భారీ విమానం..