భారత్‌పై రివేంజ్‌.. పాక్ చేసిన తీరు చూస్తే.. నవ్వాల్సిందే..

| Edited By:

Oct 24, 2019 | 12:28 AM

పాకిస్థాన్ అంటేనే వక్రబుద్దికి కేరాఫ్ లాంటి దేశం. ఆ విషయం జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370 అంశంతో దాదాపు అన్ని దేశాలకు అర్థమైంది. అయితే ఆగస్ట్ 5న జమ్ముకశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో.. ఇరు దేశాల మధ్య దూరం అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి భారత్‌పై కయ్యానికి కాలుదువ్వుతున్న విషయం తెలిసిందే.  అయితే తాజాగా పాక్ చేస్తున్న తీరుతో అటు కోపం రావాలో.. లేక నవ్వుకోవాలో అర్థం కాకుండా పోతోంది. ఇప్పటికే రైల్వే […]

భారత్‌పై రివేంజ్‌.. పాక్ చేసిన తీరు చూస్తే.. నవ్వాల్సిందే..
Follow us on

పాకిస్థాన్ అంటేనే వక్రబుద్దికి కేరాఫ్ లాంటి దేశం. ఆ విషయం జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370 అంశంతో దాదాపు అన్ని దేశాలకు అర్థమైంది. అయితే ఆగస్ట్ 5న జమ్ముకశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో.. ఇరు దేశాల మధ్య దూరం అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి భారత్‌పై కయ్యానికి కాలుదువ్వుతున్న విషయం తెలిసిందే.  అయితే తాజాగా పాక్ చేస్తున్న తీరుతో అటు కోపం రావాలో.. లేక నవ్వుకోవాలో అర్థం కాకుండా పోతోంది. ఇప్పటికే రైల్వే సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. మరో  సర్వీసు కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అదే పోస్టల్ సర్వీసు.. అసలు దీనిని నిలిపివేస్తారని ఎవరూ ఊహించని విధంగా పోస్టల్ సర్వీసులను కూడా నిలిపివేసింది పాక్.

దాదాపు రెండు నెలల నుంచి పాక్ నుంచి భారత్‌కు తపాలా సేవలు ఆగిపోయాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. పాక్ తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలా వ్యవహరించడమేంటని ప్రశ్నించారు. అన్ని దేశాల తపాలా శాఖలు ప్రపంచ తపాలా సమాఖ్య విధానం కింద పని చేస్తాయని.. అయితే పాక్ చర్య దీనికి వ్యతిరేకంగా ఉందన్నారు. పాక్ నిర్ణయానికి తగ్గట్లుగానే భారత తపాలా శాఖ ప్రతిస్పందన ఉంటుందని ఘాటుగా స్పందించారు.