Pakistan Tunnel: జమ్మూలో మరో అతి పెద్ద పాక్ సొరంగం గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ బలగాలు.. పది రోజుల్లో ఇది రెండోది

|

Jan 23, 2021 | 4:03 PM

Pakistan Tunnel: భారతదేశంలోకి ఉగ్రవాదులను పంపేందుకు జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్‌ ఐఎస్ఐ ఉపయోగించిన 150 మీటర్ల పొడవైన రహస్య సొరంగాన్ని శనివారం బీఎస్‌ఎఫ్‌..

Pakistan Tunnel: జమ్మూలో మరో అతి పెద్ద పాక్ సొరంగం గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ బలగాలు.. పది రోజుల్లో ఇది రెండోది
Follow us on

Pakistan Tunnel: భారతదేశంలోకి ఉగ్రవాదులను పంపేందుకు జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్‌ ఐఎస్ఐ ఉపయోగించిన 150 మీటర్ల పొడవైన రహస్య సొరంగాన్ని శనివారం బీఎస్‌ఎఫ్‌ అధికారులు గుర్తించారు. ఇది గత 15 రోజుల్లో బీఎస్‌ఎఫ్‌ గుర్తించిన రెండవ సొరంగం కావడం గమనార్హం. అయితే గత ఏడాదిగా బీఎస్‌ఎఫ్‌ పలు సొరంగాలను గుర్తించి ధ్వంసం చేసినట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు. కథువా జిల్లాలోని పన్సర్‌ వద్ద బీఎస్‌ఎఫ్‌ అవుట్‌ పోస్టు సమీపంలో 30 అడుగుల లోతైన టన్నెల్‌ను అధికారులు గుర్తించారు.

ఈ భారీ సొంగం ద్వారా ఎనిమిదేళ్ల నుంచి భారత్‌లోకి పాకిస్తాన్‌ ఉగ్రవాదులను చొప్పిస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో 2012 నుంచి పాక్‌ భారత శిబిరాలపై కాల్పులకు తెగబడుతోందని, ఈ ప్రాంతానికి సమీపంలో కొత్త బంకర్‌ను నిర్మించిందని అధికారులు గుర్తించారు. నియంత్రణ రేఖ వెంబడి భారీగా సేనలను మోహరించడంతో పాటు నిఘాను మరింత తీవ్రతరం చేయడంతో చొరబాట్లు సాధ్యం కాకపోవడంతో ఈ సొరంగం మార్గం ద్వారా దేశంలోకి ఉగ్రవాదులను పాక్‌ ప్రేరేపిస్తోందని బీఎస్‌ఎఫ్‌ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, పాకిస్తాన్‌ భారతదేశంలో చొరబాట్ల కోసం నిర్మించినట్లు భావిస్తున్న సొరంగాలను గుర్తించి నాశనం చేస్తోంది భారత్‌.

గతంలోనూ ఈ ప్రాంతంలో పలు ఘటనలు సొరంగం దొరికిన ప్రదేశానికి కొంతదూరంలో సరిహద్దు డామినేషన్‌ పెట్రోలింగ్‌కు నాయకత్వం వహిస్తున్న బీఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ వినయ్‌ ప్రసాద్‌ 2019 జనవరిలో సరిహద్దు మీదుగా స్పిపర్‌ కాల్పులలో మరణించారు. పది నెలల తర్వాత 2019 నవంబర్‌లో అదే ప్రాంతంలో ఉగ్రవాదు బృందాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. ఉగ్రవాదుల చొరబాటు నియంత్రణ రేఖ వెంట సైనికులను మోహరించే ప్రయోజనాన్ని దెబ్బతిస్తుందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. భద్రతా దళాల పహారా మధ్య నియంత్రణ రేఖను దాటడం కష్టంగా భావించినప్పుడు పాక్‌ ఉగ్రవాదులు ఈ సొరంగాలను ఉపయోగిస్తారని, తీవ్రవాద నిరోధక అధికారులు చెబుతున్నారు.

Also Read: షాకింగ్‌.. ఈ ఏడాది మార్చి నుంచి ఆ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసిన ఆర్బీఐ