
న్యూఢిల్లీ: బ్రిక్స్ సమ్మిట్ 2026లో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం నుంచి దిగిన అనంతరం ఆయన తన కోటును విప్పిన తీరు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. పుతిన్ హుందాగా, ఎంతో సునాయాసంగా కోటును ఒక్క కదలికతో తొలగించి భద్రతా సిబ్బందికి అందించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
వైరల్ వీడియోలో పుతిన్ విమానం నుంచి దిగిన తర్వాత తన వాహనం వైపు వెళ్తూ కనిపించారు. కారు ఎక్కే ముందు ఆయన తన కోటును వేగంగా విప్పి పక్కనే ఉన్న భద్రతా సిబ్బందికి అందించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన చూపించిన వేగం, నియంత్రణ, హుందాతనం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 73 ఏళ్ల వయసులోనూ ఆయన చురుకుదనం ఆకట్టుకుంటోందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
పుతిన్ నడకపైనా గతంలో చర్చ
వ్లాదిమిర్ పుతిన్ నడిచే తీరు కూడా గతంలో పలుమార్లు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆయన నడుస్తున్నప్పుడు కుడి చేతిని తక్కువగా ఊపుతూ, దానిని శరీరానికి దగ్గరగా ఉంచే తీరు పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. పుతిన్ మాజీ కేజీబీ అధికారి కావడంతో ఆయన సుదీర్ఘ శిక్షణకు ఈ నడకతో సంబంధం ఉందనే వివరణలు గతంలో ప్రచారంలోకి వచ్చాయి. పుతిన్ శైలిపై చర్చ సందర్భంగా ఆయన కేజీబీ నేపథ్యాన్ని కూడా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. అయితే, కుడిచేతి కదలిక లేదా కోటు విప్పే విధానం నేరుగా కేజీబీ శిక్షణ వల్లే వచ్చిందని నిర్ధారించే ఆధారాలు లేవు. గతంలో ప్రచురితమైన కొన్ని కథనాల్లో మాత్రం ఆయన నడకను శారీరక అలవాట్లు, శిక్షణతో అనుసంధానించే ప్రయత్నాలు జరిగాయి.
ఏదేమైనా.. రాజకీయ సమావేశాలపై సాధారణంగా దృష్టి సారించే పుతిన్ తాజా పర్యటనలో ఆయన కోటు విప్పిన చిన్న వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బ్రిక్స్ సమ్మిట్‌కు సంబంధించిన రాజకీయ పరిణామాలతో పాటు పుతిన్ ప్రత్యేక శైలిపై కూడా నెటిజన్లు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…