ఇండియాను ఇలా ఎప్పుడు చూస్తాం ..? ‘వింబుల్డన్’ ప్రేక్షకులను చూసిన బాంబేహైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్య

| Edited By: Anil kumar poka

Jul 14, 2021 | 10:06 AM

గతవారం వింబుల్డన్ లో మెన్స్ సింగిల్స్ మధ్య జరిగిన పోటీలో నోవాక్ జొకోవిచ్ పైనే అందరి కళ్ళూ ..! మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ అయితే అతగాడు గెలుచుకున్నాడు గానీ అసలు ఈ 'పోరు'ను చూడడానికి స్టేడియంలో హాజరైన ప్రేక్షకుల్లో ఎవరూ మాస్కులు ధరించకపోవడం విశేషం.

ఇండియాను ఇలా ఎప్పుడు చూస్తాం ..? వింబుల్డన్ ప్రేక్షకులను చూసిన బాంబేహైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్య
Bombay Highcourt On Wimbledon Spectators
Follow us on

గతవారం వింబుల్డన్ లో మెన్స్ సింగిల్స్ మధ్య జరిగిన పోటీలో నోవాక్ జొకోవిచ్ పైనే అందరి కళ్ళూ ..! మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ అయితే అతగాడు గెలుచుకున్నాడు గానీ అసలు ఈ ‘పోరు’ను చూడడానికి స్టేడియంలో హాజరైన ప్రేక్షకుల్లో ఎవరూ మాస్కులు ధరించకపోవడం విశేషం. ఇది గమనించిన బాంబేహైకోర్టు న్యాయమూర్తులు ఇలాంటి సాధారణ పరిస్థితిని ఇండియా ఎప్పుడు చూస్తుందని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తీ వ్యాక్సిన్ తీసుకుంటేనే ఈ విధమైన పరిస్థితిని చూడగలుగుతామన్నారు. మహారాష్ట్రలో కోవిడ్ పరిస్థితి పైన, థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ సన్నద్ధత పైన దాఖలైన పిల్ ను చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జి.ఎస్. కులకర్ణి విచారించిన సందర్భంగా బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. వింబుల్డన్ ఫైనల్ ఈ సంవత్సరానికే అద్భుతమని, మీరు చూశారో, లేదో తెలియదు గానీ ప్రేక్షకుల్లో ఒక్క మహిళ తప్ప మరెవరూ మాస్కులు ధరించలేదని న్యాయమూర్తులు..అడ్వొకేట్ జనరల్ అశుతోష్ ని ఉద్దేశించి అన్నారు. స్టేడియం అంతా స్పెక్టేటర్లతో నిండిపోయిందని, ఒక ఇండియన్ క్రికెటర్ కూడా మాస్క్ ధరించలేదని వీరన్నారు.

ఇలాంటి పరిస్థితి ఇండియాకు ఎప్పుడు వస్తుంది? ప్రతివారూ మాస్కు ధరించని పరిస్థితిని మనం చూడగలుగుతామా ? తిరిగి ఆ విధమైన ‘వాతావరణం’ రావాలి అన్నారు. అందుకే ప్రతి వ్యక్తీ వ్యాక్సిన్ తీసుకోవాలి.. ఇది యుద్ధ ప్రాతిపదికన జరగాలి అని జడ్జీలు వ్యాఖ్యానించారు. అప్పుడే థర్డ్ వేవ్ ని నివారించగలుతామన్నారు. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్నాయని వార్తలు వస్తుంబాయని, అందువల్ల ప్రభుత్వం వెంటనే దీని నివారణకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇలా ఉండగా బుధవారం మొదటిసారిగా కేంద్ర కేబినెట్ వర్చ్యువల్ గా కాకుండా యధాప్రకారం ‘భౌతికంగా’ సమావేశమవుతోంది. గత ఏడాది ఏప్రిల్ మొదటివారంలో ఇలా సమావేశమయ్యాక మళ్ళీ ఇన్నాళ్లకు కేబినెట్ ఈ విధంగా మీట్ కావడం నిజంగా విశేషమే.

మరిన్ని ఇక్కడ చూడండి : థర్డ్ వేవ్ షురూ.. మహారాష్ట్ర లో మళ్ళీ పుంజుకుంటున్న కోవిడ్ కేసులు..:Third Wave Of Corona Video.

 రాజకీయాల్లోకి జాకీ చాన్..?100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో సభ్యత్వం కోసం చైనా అధ్యక్షుడికి విన్నపం!:Jackie Chan In politics video.

 పచ్చడి పెడుతున్న ప్రకాష్ రాజ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది అంటున్న నెటిజన్లు..(వీడియో):Prakash Raj Mango Pickle video.

 News Watch : ఇకపై ఏటా కొలువులు..!మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్…( వీడియో )