తుపాకులు పట్టుకొని డ్యాన్స్ వేసిన ఎమ్మెల్యేపై బీజేపీ వేటు

| Edited By:

Jul 17, 2019 | 8:26 PM

ఇటీవల మందు కొట్టి, తుపాకులు పట్టుకొని డ్యాన్స్ వేసిన ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్‌పై వేటు పడింది. ఆరేళ్లపాటు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని క్రమశిక్షణా కమిటీ నిర్ణయించినట్లు బీజేపీ జాతీయ మీడియా ఇన్‌ఛార్జ్ అనిల్ బలూని వెల్లడించారు. అయితే ఖాన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన ప్రణవ్.. ఇటీవల డెహ్రాడూన్‌లోని ఓ హోటల్‌లో మద్యం సేవిస్తూ.. తుపాకులు పట్టుకొని డ్యాన్స్ వేశారు. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇది కాస్త […]

తుపాకులు పట్టుకొని డ్యాన్స్ వేసిన ఎమ్మెల్యేపై బీజేపీ వేటు
Follow us on

ఇటీవల మందు కొట్టి, తుపాకులు పట్టుకొని డ్యాన్స్ వేసిన ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్‌పై వేటు పడింది. ఆరేళ్లపాటు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని క్రమశిక్షణా కమిటీ నిర్ణయించినట్లు బీజేపీ జాతీయ మీడియా ఇన్‌ఛార్జ్ అనిల్ బలూని వెల్లడించారు.

అయితే ఖాన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన ప్రణవ్.. ఇటీవల డెహ్రాడూన్‌లోని ఓ హోటల్‌లో మద్యం సేవిస్తూ.. తుపాకులు పట్టుకొని డ్యాన్స్ వేశారు. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇది కాస్త బీజేపీ అధిష్టానం వరకు చేరడంతో.. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనను కోరింది. అయితే దానికి ప్రణవ్ సింగ్ చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని పార్టీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయించింది.