Viral: మేడ మీద కూరగాయ మొక్కల పెంపకం.. వాటి మధ్యలో ఉన్న మాయదారి మొక్కల్ని చూసి స్టన్ అయిన పోలీసులు

|

Jun 26, 2022 | 3:37 PM

అల్లుడు చేసిన పనికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశాడు ఓ వ్యక్తి. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాలు....

Viral: మేడ మీద కూరగాయ మొక్కల పెంపకం.. వాటి మధ్యలో ఉన్న మాయదారి మొక్కల్ని చూసి స్టన్ అయిన పోలీసులు
Representative image
Follow us on

Thiruvananthapuram: ‘తన ఇంటిని మంచిగా నడిపించలేనివాడు.. ప్రజలను ముందుండి నడిపించేందుకు అర్హత కోల్పోతాడు’.. తన పదవికి రాజీనామా చేస్తూ  బీజేపీ ఎస్సీ (షెడ్యూల్డ్ కులాల) మోర్చా తిరువనంతపురం జిల్లా అధ్యక్షుడు సంతోష్ విలప్పిల్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ ఇది. సుదీర్ఘమైన పోస్ట్‌ రాస్తూ ఆయన నైతిక విలువల గురించి ప్రధానంగా ప్రస్తావించాడు. సంతోష్ కూతుర్ని వివాహం చేసుకున్న రంజిత్ (33) కూడా తిరువనంతపురంలోని మలైంకీజులో తన అత్తమామల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గంజాయి (Ganja) పెంచుతున్నందుకు అతడిని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంజిత్… సంతోష్ విలప్పిల్ ఇంటి మేడమీద కూరగాయల చెట్ల మధ్య నిషేధిత గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులు తెలిపారు. స్పెషల్ పోలీస్ టీమ్ అతని ఇంటి మేడపై 2 ప్లాస్టిక్ సంచుల్లో పెంచిన 17 గంజాయి మొక్కల్ని స్వాధీనం చేసుకుంది. అయితే, ఈ వ్యవహారం గురించి తెలియగానే తానే పోలీసులకు సమాచారం అందించానని సంతోష్ విలప్పిల్ తెలిపాడు.  ‘నా అల్లుడు మాత్రమే కాదు.. అ ప్లేసులో నా కొడుకు ఉన్నా పోలీసులకు సమాచారం ఇస్తా’నని ఆయన పేర్కొన్నాడు. సంతోష్ తిరువనంతపురం జిల్లా పంచాయతీలోని మలైంకీజు డివిజన్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు.

కాగా ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా గంజాయి విపరీతంగా పట్టుబడుతుంది. యువత పెద్ద ఎత్తున ఈ మాయదారి మత్తుకు బానిసైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే స్మగర్లు రకరకాల మార్గాల్లో గంజాయిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు స్మగ్లించే చేసేందుకు యత్నిస్తున్నారు. దొరికినప్పుడు కఠిన కేసులు పెట్టి.. జైల్లో పెట్టినా.. మళ్లీ బయటకు వచ్చి అదే దందా కొనసాగిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్‌పై ప్రభుత్వాలు, పోలీసులు మరింత శ్రద్ద పెట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి