Uttar Pradesh Elections 2022: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు.. సీనియర్‌ నేతలకు చోటు..

| Edited By: Anil kumar poka

Dec 23, 2021 | 6:23 PM

చ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే..

Uttar Pradesh Elections 2022:  బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు..  సీనియర్‌ నేతలకు చోటు..
Follow us on

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు ఎక్కువగా యూపీ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించాయి. ముఖ్యంగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని మరోసారి అధిరోహించేందుకు కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్‌తో సహా పలువురు బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం కోసం రోడ్‌మ్యాప్‌ కూడా సిద్ధం చేస్తున్నారు. కాగా రాష్ట్రంలోని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా అధికార బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలకు ఈ కమిటీలో స్థానం కల్పించింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర విభాగం మీడియా కో- ఇన్‌ఛార్జి అభయ్‌సింగ్‌ ఈ కమిటీని ప్రకటించారు.

యూపీ ఆర్థిక మంత్రి సురేశ్‌ ఖన్నా ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. అదేవిధంగా ఎంపీ బ్రిజ్‌లాల్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వీరితో పాటు పార్టీ సీనియర్‌ నేతలు రాజేష్‌ వర్మ, విజయ్‌ పాల్‌ తోమర్‌, రీటా బహుగుణ జోషి, సీమా ద్వివేది, పుష్కర్‌ మిశ్రా, కాంత కర్దమ్‌ సభ్యులుగా వ్యవహరించనున్నారు. యూపీ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై ఈ కమిటీ కసరత్తు చేయనుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. ప్రియాంకా గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి.

Also Read:

Postmortem in Night: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్టుమార్టంకు అనుమతి

Purvanchal Expressway: వాయుసేన విమానంలో రోడ్డుపై దిగనున్న ప్రధాన మంత్రి మోడీ.. ఎందుకంటే..

Quarantine-Free Travel: భారత్ వచ్చే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ నిబంధనలు వర్తించవు!