Government School: ఆ స్కూళ్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకూ యూనిఫాం తప్పనిసరి..

|

Jul 11, 2022 | 10:08 AM

Bihar Govt School: స్కూల్‌లో సాధారణంగా విద్యార్థులు యూనిఫాం ధరించడం కామన్. కానీ, స్కూల్ టీచర్స్ సహా ఇతర సిబ్బంది మొత్తం ఒకే..

Government School: ఆ స్కూళ్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకూ యూనిఫాం తప్పనిసరి..
School
Follow us on

Bihar Govt School: స్కూల్‌లో సాధారణంగా విద్యార్థులు యూనిఫాం ధరించడం కామన్. కానీ, స్కూల్ టీచర్స్ సహా ఇతర సిబ్బంది మొత్తం ఒకే రకమైన యూనిఫాం ధరించడం ఎప్పుడైనా చూశారా? అయితే, ఇప్పుడు చూసేయండి. బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బాంకే బజార్ బ్లాక్ పరిధిలో ఓ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా యూనిఫాంలో పాఠశాలకు వస్తున్నారు. ఇదే అంశంపై పాఠశాల ప్రాధానొపాధ్యాయుడు స్పందించారు.

‘పాఠశాలలోని ఉపాధ్యాయులు, గార్డులు, వంటవారు అందరం సమావేశం అయ్యాం. విద్యార్థులతో పాటే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కూడా యూనిఫాంలో పాఠశాలకు రావాలని నిర్ణయించుకున్నాం. నా ప్రైవేట్ నిధుల నుంచి మొదటి సెట్ యూనిఫాం అందించాలని నిర్ణయించుకున్నాను.’ అని స్కూల్ ప్రిన్సిపాల్ నాగేశ్వర్ దాస్ తెలిపారు. కాగా, వీరి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సమానత్వం చూపడానికై స్కూల్ సిబ్బంది తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసలు వస్తున్నాయి.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..