Lok Sabha Election: బీహార్‌లో మేమిద్దరం బీజేపీని ఓడించాం.. దేశంలో కూడా బీజేపీని ఓడిస్తాం.. సోనియాతో భేటీ తర్వాత నితీష్‌, లాలు కామెంట్స్

|

Sep 25, 2022 | 8:17 PM

Target 2024: బీహార్‌లో తామిద్దరం కలిసి బీజేపీని అధికారం నుంచి పంపించామని, దేశంలో కూడా సోనియాగాంధీతో కలిసి బీజేపీ ఓడిస్తామన్నారు ఇద్దరు నేతలు. సోనియాగాంధీతో త్వరలో..

Lok Sabha Election: బీహార్‌లో మేమిద్దరం బీజేపీని ఓడించాం.. దేశంలో కూడా బీజేపీని ఓడిస్తాం.. సోనియాతో భేటీ తర్వాత  నితీష్‌, లాలు కామెంట్స్
Lalu Prasad and Nitish Kumar
Follow us on

ఎన్నో ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ సోనియాగాంధీతో భేటీ అయ్యారు బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌(Nitish Kumar), ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌(Lalu Prasad ). బీహార్‌లో తామిద్దరం కలిసి బీజేపీని అధికారం నుంచి పంపించామని, దేశంలో కూడా సోనియాగాంధీతో కలిసి బీజేపీ ఓడిస్తామన్నారు ఇద్దరు నేతలు. సోనియాగాంధీతో త్వరలో మరోసారి భేటీ అవుతామని ప్రకటించారు లాలూప్రసాద్‌ యాదవ్‌. హర్యానాలోని ఫతేహాబాద్‌లో మాజీ ఉప ప్రధాని చౌదరి దేవిలాల్ జయంతి సందర్భంగా ఐఎన్‌ఎల్‌డి నిర్వహించిన ‘సమ్మన్ దివాస్ ర్యాలీ’ అనంతరం నితీష్ కుమార్, లాలూ యాదవ్‌తో కలిసి 10 జనపథ్‌కు చేరుకున్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత సోనియాను నితిష్ కుమార్ కలవడం ఇదే తొలిసారి. 

ఇది కాకుండా లాలూ యాదవ్ చాలా కాలం తర్వాత 10 జన్‌పథ్‌కు చేరుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యతపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి ముందు రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు. బీహార్‌లోని అధికార మహాకూటమిపై దాడి చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. 

బీజేపీని టార్గెట్‌గా లాలూ యాదవ్‌ విమర్శలు..

దాణా కుంభకోణం కేసుల్లో శిక్షలు పడటం.. ఆ తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా లాలూ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆదివారం ఢిల్లీకి చేరుకున్న తర్వాత అమిత్ షాపై విమర్శల దాాడి మొదలు పెట్టారు. బీహార్‌లో బీజేపీ ప్రభుత్వం దిగిపోయింది. అయితే రాబోయే  2024లో ఎన్నికల్లో కూడా బిజెపి తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు లాలూ ప్రసాద్ యాదవ్. 

మరిన్ని జాతీయ వార్తల కోసం