CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్

| Edited By: Pardhasaradhi Peri

Jan 26, 2021 | 7:41 AM

CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక...

CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్
Follow us on

CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేదని, విభజన కంటే కలిసి ఉండడాన్ని తమ నేతృత్వ బలం నమ్ముతుందని అన్నారు. రాష్ట్రాన్ని నాలుగు విభాగాలుగా విభజించాలని మాయావతి నేతృత్వంలో బీఎస్పీ ప్రభుత్వం 2011లోనే ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే బుందేల్ ఖండ్, పుర్వాంచల్, అవద్ ప్రదేశ్, హరితప్రదేశ్ గా విభజించాలని అప్పటి అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే తాజాగా ఓ సమావేశంలో రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ను అడిగి ప్రశ్నకు స్పందించారు.

తమకున్న చరిత్రపై ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎంతో గర్వపడతారు. రాష్ట్రానికి దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఐక్యంగా ఉండాలని మేము విశ్వసిస్తాం.. విభజనను కాదు..అని యోగి అన్నారు. ఇక తాజాగా జరిగిన ఓ సమావేశంలో జైశ్రీరాం నినాదాలపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నేపథ్యంలో యూపీ సీఎం స్పందించారు. జైశ్రీరాం నినాదాల గురించి చెడుగా భావించడానికి ఏమీ లేదని, అయితే ఈ నినాదాలు చేయాలని ఎవరిపైనా ఒత్తిడి చేయమని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Corona Vaccination: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్‌ టీకా పంపిణీ.. ఇప్పటి వరకు 19.5 లక్షల మందికి వ్యాక్సినేషన్‌