దేశవ్యాప్తంగా సీబీఐ పంజా.. 187 ప్రాంతాల్లో.. వెయ్యి మందితో..!

| Edited By:

Nov 06, 2019 | 8:40 AM

బ్యాంక్ ఫ్రాడ్ కేసులపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. రూ.7200కోట్ల విలువైన ఫ్రాడ్ కేసులకు సంబంధించి.. మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా 187 ప్రాంతాల్లో దాదాపు వెయ్యి మంది అధికారులు దాడులు చేశారు. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, గుజరాత్, హరియాణా, చండీగడ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, దాద్రా, నగర్ హవేలి, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఈ సంవత్సరంలో […]

దేశవ్యాప్తంగా సీబీఐ పంజా.. 187 ప్రాంతాల్లో.. వెయ్యి మందితో..!
Follow us on

బ్యాంక్ ఫ్రాడ్ కేసులపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. రూ.7200కోట్ల విలువైన ఫ్రాడ్ కేసులకు సంబంధించి.. మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా 187 ప్రాంతాల్లో దాదాపు వెయ్యి మంది అధికారులు దాడులు చేశారు. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, గుజరాత్, హరియాణా, చండీగడ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, దాద్రా, నగర్ హవేలి, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఈ సంవత్సరంలో జరిగిన అతి పెద్ద సెర్చ్ ఆపరేషన్‌గా ఈ దాడులను భావిస్తున్నారు. కాగా రూ7వేల కోట్లకు సంబంధించి.. దేశవ్యాప్తంగా 42 ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో నెల రోజుల క్రితం బ్యాంకులను మోసం చేస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు దాడులు చేసి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.