కీలక తీర్పునిచ్చిన జాతీయ హరిత ట్రిబ్యునల్.. ఆ నగరాలు, పట్టణాల్లో బాణాసంచా పూర్తిగా నిషేధం..

|

Dec 03, 2020 | 7:44 AM

దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం పెరుగుతుండటంతో జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) కీలక తీర్పునిచ్చింది. దేశంలో వాయు కాలుష్యం ఎక్కువగా...

కీలక తీర్పునిచ్చిన జాతీయ హరిత ట్రిబ్యునల్.. ఆ నగరాలు, పట్టణాల్లో బాణాసంచా పూర్తిగా నిషేధం..
Follow us on

దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం పెరుగుతుండటంతో జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) కీలక తీర్పునిచ్చింది. దేశంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై ఎన్జీటీ నిషేధం విధించింది. కరోనా వైరస్ వ్యాప్తికి వాతావరణ కాలుష్యం కూడా దోహద పడుతుందని, ప్రజల ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ ఉధృతి కొనసాగుతున్నందున దేశ రాజధాని ఢిల్లీతో పాటు, గాలి నాణ్యత తక్కువగా ఉన్న అన్ని పట్టణాలు, నగరాల్లో బాణాసంచాపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, గాలి నాణ్యత సంతృప్తికర స్థాయిలో ఉన్న పట్టణాలు, నగరాల్లో మాత్రం కొన్ని వెసులుబాట్లు కల్పించినట్లు తెలిపారు. పండుగలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం రెండు గంటల పాటు బాణాసంచా వినియోగించవచ్చునని గతంలో ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉంటాయని జస్టిస్ ఆదర్శ్ కుమార్ తెలిపారు. ఒకవేళ ఎన్జీటీ తీర్పును విస్మరించి నిషేధిత ప్రాంతాల్లో బాణా సంచాను విక్రయించినా, కాల్చినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎన్జీటీ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.