చైనీస్‌ యాప్‌ల నిషేధమనేది “డిజిటల్‌ స్ట్రయిక్‌”.. : కేంద్ర మంత్రి

| Edited By:

Jul 02, 2020 | 5:19 PM

ఇటీవల కేంద్ర ప్రభుత్వం 59 చైనీస్‌ యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పందించారు. ఇది డ్రాగన్‌పై డిజిటల్‌ దాడి అంటూ..

చైనీస్‌ యాప్‌ల నిషేధమనేది డిజిటల్‌ స్ట్రయిక్‌.. : కేంద్ర మంత్రి
Follow us on

ఇటీవల కేంద్ర ప్రభుత్వం 59 చైనీస్‌ యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పందించారు. ఇది డ్రాగన్‌పై డిజిటల్‌ దాడి అంటూ వర్ణించారు. గత నెలలో లదాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌-చైనా జవాన్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఇరవై మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో దేశంలో చైనా వస్తువుల పట్ల విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా చైనీస్‌ యాప్‌లను కూడా నిషేధించాలంటూ ఆందోళన కొనసాగింది. ఈ క్రమంలో ప్రజల వ్యక్తిగత భద్రత నేపథ్యంలో చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించింది. భారత్‌ శాంతిని కోరుకుంటుందని.. అదే సమయంలో ఎవరైనా కుట్రలు పన్నితే సహించేది లేదని.. అందుకు తగిన సమాధానం ఇస్తామని కేంద్ర మంత్రి అన్నారు.