బజాజ్‌‌ ఆటో సంస్థను వణికిస్తోన్న కరోనా.. ఏకంగా 400 కేసులు

| Edited By:

Jul 07, 2020 | 7:26 PM

ప్రముఖ ఆటో దిగ్గజం బజాబ్‌ ఆటోలో కరోనా కలకలం రోజురోజుకు ఎక్కువవుతోంది. ముంబైలోని సంస్థ ప్లాంట్‌(వాలూజ్‌ ఏరియా)లో కరోనా కేసుల సంఖ్య 400కు చేరింది.

బజాజ్‌‌ ఆటో సంస్థను వణికిస్తోన్న కరోనా.. ఏకంగా 400 కేసులు
Follow us on

ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్‌‌ ఆటోలో కరోనా కలకలం రోజురోజుకు ఎక్కువవుతోంది. ముంబైలోని సంస్థ ప్లాంట్‌(వాలూజ్‌ ఏరియా)లో కరోనా కేసుల సంఖ్య 400కు చేరింది. దీంతో ప్లాంట్‌కు వచ్చేందుకు‌ కార్మికులు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. దీనిపై బజాజ్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తెంగడే బాజీరావ్ మాట్లాడుతూ.. కరోనా కేసుల సంఖ్య పెరిగినందున,  వైరస్‌ వ్యాప్తిని తగ్గించడం కోసం ఎనిమిది నుంచి పది రోజులు ప్లాంట్‌లో పని నిలిపివేయాలని కోరుతున్నామని అన్నారు. దీనిపై మేనేజ్‌మెంట్‌తో చర్చిస్తామనీ, మధ్యవర్తిత్వం వహించడానికి ప్రభుత్వ అధికారులను కూడా సంప్రదిస్తున్నామని తెలిపారు.

అవసరమైతే ఉత్పత్తి నష్టాన్ని భర్తీ చేయడం కోసం అదనపు గంటలు కేటాయించాలని కోరినట్లు వర్కర్స్‌ యూనియన్‌ వెల్లడించింది. అయితే దీనిపై బజాజ్‌ యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా కరోనా కారణంగా ఇప్పటివరకు బజాజ్ ఆటో సంస్థలో ఏడుగురు కార్మికులు చనిపోయారు.