బాబ్లీ గేట్లు ఎత్తివేత…శ్రీరాం సాగర్‌లోకి వరద వెల్లువ

|

Jul 01, 2020 | 4:45 PM

నిజామాబాద్‌లో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను అధికారులు తెరిచారు. దీంతో గోదావరి పరవళ్లు తొక్కనుంది. ప్రస్తుతం బాబ్లీ వద్ద గోదావరిలో ..

బాబ్లీ గేట్లు ఎత్తివేత...శ్రీరాం సాగర్‌లోకి వరద వెల్లువ
Follow us on

 

నిజామాబాద్‌లో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను అధికారులు తెరిచారు. 0.628 టీఎంసీల నీళ్లు శ్రీరాంసాగర్‌లోకి చేరుకోనున్నాయి. దీంతో గోదావరి పరవళ్లు తొక్కనుంది. ప్రస్తుతం బాబ్లీ వద్ద గోదావరిలో నిల్వ ఉన్న 0.56 టీఎంసీల నీరు దిగువ గోదావరికి ప్రవహిస్తోంది. ఈ నీరు మధ్యాహ్నానికి తెలంగాణ సరిహద్దు కాండకుర్తి వద్దకు చేరింది. వరద ఉధృతి నేపథ్యంలో శ్రీరాంసాగర్ ఎగువన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని ఎస్ఆర్ఎస్‌పీ అధికారులు సూచించారు.

బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తడం ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతీ ఏటా బాబ్లీ గేట్ల ఎత్తివేత, మూసివేతను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్‌ 30న అర్ధరాత్రి అంటే జూలై 1న ఇరు రాష్టాల్ర అధికారులు, కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు గేట్లను తెరిచారు. నేటి నుంచి 120 రోజులు పాటు అంటే అక్టోబర్‌ 28 వరకు గేట్ల‌ను ఎత్తి ఉంచాల్సి ఉంటుంది.