Assembly Elections 2022: ప్రచార ర్యాలీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 11 వరకు నిషేధం పొడిగింపు

|

Jan 31, 2022 | 4:08 PM

వచ్చే నెల నుంచి జరుగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

Assembly Elections 2022: ప్రచార ర్యాలీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 11 వరకు నిషేధం పొడిగింపు
Election Expenditure
Follow us on

EC Extends ban on Election Rallies: వచ్చే నెల నుంచి జరుగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రచార ర్యాలీలపై నిషేధాన్ని ఫిబ్రవరి 11 వరకు పొడిగించింది. అయితే రాజకీయ పార్టీలకు ప్రచారానికి కొంత సడలింపు ఇచ్చింది=. ఇప్పుడు 500 మందికి బదులుగా, 1000 మందితో కూడిన సమావేశానికి అనుమతినిచ్చింది. అదే సమయంలో, ఇండోర్ సమావేశాలకు వ్యక్తుల సంఖ్యను కూడా 500కి పెంచారు. ఇది కాకుండా, ఇప్పుడు అభ్యర్థులు 20 మందితో ఇంటింటికీ ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్ సహా గోవా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్ కారణంగా, కమిషన్ మొత్తం ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ బూత్‌ల సంఖ్యను కూడా పెంచింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1,74,351 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇది గత ఎన్నికల కంటే 18.49 శాతం ఎక్కువ. దీంతో పాటే ఉత్తరాఖండ్‌లో 11,647 పోలింగ్ బూత్‌లు ఉండనున్నాయి. ఇది గత ఎన్నికల కంటే 7.31 శాతం ఎక్కువ. పంజాబ్‌లో ఈసారి 24,689 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇది గత ఎన్నికల కంటే 9.24 శాతం ఎక్కువ. మణిపూర్‌లో 2,959 పోలింగ్ బూత్‌లను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.


Read Also… US Snow Strom: శీతల గాలుల ఎఫెక్ట్.. జీవం ఉన్నా.. జీవశ్ఛవాలుగా మారిన మూగ జీవులు.. అధికారులు పలు సూచనలు..