Assam Elections Date 2021: ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. అసోంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

|

Feb 26, 2021 | 5:37 PM

Assam Electionsl Date 2021: దేశంలో మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల కమిషన్‌ చర్యలు ..

Assam Elections Date 2021: ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. అసోంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
Follow us on

Assam Elections Date 2021: దేశంలో మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టింది. దేశంలో పశ్చిమబెంగాల్‌, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా తెలిపారు. అలాగే 16 రాష్ట్రాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికకూ షెడ్యూల్‌ విడుదలైంది. ఐదు రాష్ట్రాల్లోని 824 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికలకు 2.70 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారినే సిబ్బందిగా నియమిస్తామని ప్రకటించారు. పోలింగ్‌ సమయంలో గంటసేపు పెంపు, పోస్టల్‌ బ్యాలెట్‌ యథాతథం ఉండనుంది. అలాగే 80 ఏళ్లుపైబడిన వృద్ధులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌గా సీఈసీ ప్రకటించారు. అయితే ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ వేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ఇక అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు. అయితే అసోం రాష్ట్రంలో మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

తొలి దశ:

నోటిఫికేషన్‌ – మార్చి 2
పోలింగ్‌ – మార్చి 27
కౌటింగ్‌ – మే 2

రెండో దశ :

నోటిఫికేషన్‌ – మార్చి 5
పోలింగ్‌ – ఏప్రిల్‌ 1
కౌంటింగ్‌ – మే 2

మూడో దశ:

నోటిఫికేషన్‌ – మార్చి 5
పోలింగ్‌ – ఏప్రిల్‌ 6
కౌంటింగ్‌ – మే 2