Farmers Protest: ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు మా ఊళ్లలోకి రావొద్దు.. 60 గ్రామాల్లో వెలసిన నిరసన బోర్డులు..

|

Jan 13, 2021 | 6:21 PM

Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున..

Farmers Protest: ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు మా ఊళ్లలోకి రావొద్దు.. 60 గ్రామాల్లో వెలసిన నిరసన బోర్డులు..
Follow us on

Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లోనే కాకుండా తమ తమ రాష్ట్రాల్లోనూ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. తాజాగా హర్యానాలో బీజేపీ, జేజేపీ లకు చెందిన ప్రజాప్రతినిధులెవరూ తమ గ్రామాల్లోకి రావొద్దంటూ 60 గ్రామాల ప్రజలు తేల్చి చెప్పారు. ఆ మేరకు గ్రామ సరిహద్దుల్లో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు. హర్యానాలో బీజేపీ, జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరి ఉంది. అయితే, హర్యానాకు చెందిన బీజేపీ, జేజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చారనే కారణంతో వారిని బహిష్కరిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ప్రకటించారు. ఆ మేరకు వారు తీర్మానాలు కూడా చేశారు.

కాగా, కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ హర్యానా ప్రజలు తమ రాష్ట్ర ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వారికి తమ నిరసనను తెలియజేస్తున్నారు. కేంద్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున.. వ్యవసాయ చట్టాలు రద్దు చేసేలా ఇక్కడి నేతలు కేంద్రానికి వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి ‘కిసాన్ మహా పంచాయతీ’ కార్యక్రమాన్ని నిర్వహించగా రైతులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. సభ కోసం ఏర్పాటు చేసిన కుర్చీలను ధ్వంసం చేశారు. అలా ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులకు రైతులు, ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేజేపీ నాయకుడు, హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతులా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఆయనకు వివరించాలని నిర్ణయించుకున్నారు.

Also read:

Galwan Valley Warriors : రిపబ్లిక్ డే వేడుకల్లో గాల్వన్ వీరులకు చక్ర పురస్కారాలు.. సంతోష్ బాబుకు పరమవీర చక్ర ఇచ్చే అవకాశం

Telangana Minister: పిచ్చిగా మాట్లాడొద్దు, ప్రజలను రెచ్చగొట్టొద్దు.. బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్..