Galwan Valley Warriors : రిపబ్లిక్ డే వేడుకల్లో గాల్వన్ వీరులకు చక్ర పురస్కారాలు.. సంతోష్ బాబుకు పరమవీర చక్ర ఇచ్చే అవకాశం

భారత్ పరిధిలో ఉన్న సరిహద్దు ప్రాంతం గాల్వన్ లోయపై డ్రాగన్ కంట్రీ కన్నేసింది. అర్ధరాత్రి తన బుద్ధి చూపిస్తూ.. గ‌త ఏడాది జూన్ 15న ఇరుదేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణ సృష్టించింది. ఈ ఘటనలో 20 మంది భార‌తీయ సైనికులు...

Galwan Valley Warriors : రిపబ్లిక్ డే వేడుకల్లో గాల్వన్ వీరులకు చక్ర పురస్కారాలు.. సంతోష్ బాబుకు పరమవీర చక్ర ఇచ్చే అవకాశం
Follow us

|

Updated on: Jan 13, 2021 | 5:35 PM

Galwan Valley Warriors : భారత్ పరిధిలో ఉన్న సరిహద్దు ప్రాంతం గాల్వన్ లోయపై డ్రాగన్ కంట్రీ కన్నేసింది. అర్ధరాత్రి తన బుద్ధి చూపిస్తూ.. గ‌త ఏడాది జూన్ 15న ఇరుదేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణ సృష్టించింది. ఈ ఘటనలో 20 మంది భార‌తీయ సైనికులు అమరులయ్యారు. వారిలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష బాబు కూడా ఉన్నారు.

రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను పలు బిరుదులతో గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధంలో వీర మ‌ర‌ణం పొందిన సైనికులకు ఇచ్చే చ‌క్ర అవార్డుల‌ను ప్ర‌దానం చేయనున్నదని సమాచారం. 16వ బీహార్ రెజిమెంట్ క‌మాండింగ్ ఆఫీస‌ర్ క‌ల్న‌ల్ సంతోష్ బాబు గాల్వ‌న్ దాడిలో అమ‌రుడైన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న‌కు ప‌ర‌మ‌వీర చ‌క్ర అవార్డును ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. సాధార‌ణంగా యుద్ధ యోధుల‌కు ఇచ్చే అవార్డుల‌ను ఈసారి బీహార్ రెజిమెంట్‌కు ప్ర‌ధానం చేసేందుకు ఆర్మీ ఉన్న‌త శ్రేణి అధికారులు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. యుద్ధ స‌మ‌యాల్లో ఇచ్చే చ‌క్ర అవార్డుల్లో.. అత్యుత్త‌మైంది ప‌ర‌మ‌వీర చ‌క్ర‌. ఆ త‌ర్వాత మహావీర చ‌క్ర‌, వీర చ‌క్ర అవార్డుల‌ను కూడా ఇస్తారు.

ఇప్పటికే గాల్వన్ లోయలో అమరులైన భరత జవాన్లకు నివాళిగా తోటను అభివృద్ధి చేస్తున్నారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు ఈ తోట పెంపకాన్ని చేపట్టింది. ఇప్పటికే ‘గాల్వన్ కే బల్వాన్’ పేరుతో ఈ ప్రాంతంలో 1,000 కి పైగా మొక్కలను నాటారు. -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎదుర్కొనే ఈ ప్రాంతంలో అమరవీరుల గౌరవార్థం తోట పెంచుతున్న సంగతి తెలిసిందే.

Also Read: మీ ఆనందం, ప్రేమ శాశ్వత చిరునామాగా మారాలంటూ సునీతకు శుభాకాంక్షలు చెప్పిన మెగాబ్రదర్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..