రోజుకు 8 వేల సర్వీసులు.. 23 ఆటంకాలు

| Edited By:

Aug 29, 2019 | 9:47 PM

ప్రతిరోజు విమానాల రాకపోకల్లో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయని ఎంతమందికి తెలుసు.? అయితే సరిగ్గా అదే విషయాన్ని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ (డీజీసీఏ) జనరల్‌ చీఫ్‌ అరుణ్‌కుమార్‌ వెల్లడించారు. ప్రతిరోజు విమానాల రాకపోకలకు ఆటంకం కలిగించే ఘటనలు రోజుకు 23 వరకు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. విమానాల్లో తలెత్తే టెక్నికల్ సమస్యల వల్ల ప్రతిరోజు 20 నుంచి 23 వరకు విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. వివిధ పక్షులు విమానాలకు అడ్డు రావడం, వాతావరణంలో మార్పులు, […]

రోజుకు 8 వేల సర్వీసులు.. 23 ఆటంకాలు
Follow us on

ప్రతిరోజు విమానాల రాకపోకల్లో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయని ఎంతమందికి తెలుసు.? అయితే సరిగ్గా అదే విషయాన్ని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ (డీజీసీఏ) జనరల్‌ చీఫ్‌ అరుణ్‌కుమార్‌ వెల్లడించారు. ప్రతిరోజు విమానాల రాకపోకలకు ఆటంకం కలిగించే ఘటనలు రోజుకు 23 వరకు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. విమానాల్లో తలెత్తే టెక్నికల్ సమస్యల వల్ల ప్రతిరోజు 20 నుంచి 23 వరకు విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. వివిధ పక్షులు విమానాలకు అడ్డు రావడం, వాతావరణంలో మార్పులు, వర్షాలు, పొగమంచు, దూళి వంటి సమస్యలతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని అరుణ్ కుమార్ తెలిపారు. మన దేశంలో ప్రతిరోజు వివిధ ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులకు 8 వేల విమాన సర్వీసులు నడుస్తుండగా వాటిలో 3500 సర్వీసులు దేశీయంగానే సేవలందిస్తున్నాయని తెలిపారు. ఇక విమానంలో క్రూ సిబ్బంది విషయంలో వారి ఫిట్‌నెస్, బ్రీత్ ఎనలైజర్ పరీక్షల విషయంలో తాజాగా ఏటీసీ అధికారులకు కూడా పరీక్షలు చేయాల్సి వస్తుందని అరుణ్ కుమార్ తెలిపారు.