నదిలో జారిపడ్డ జవాన్‌.. విస్తృతంగా కొనసాగుతున్న గాలింపు..

| Edited By:

Apr 17, 2020 | 9:53 PM

ప్రమాదవశాత్తూ ఓ ఆర్మీ జవాన్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని సట్లేజ్‌ నదిలో జారిపడ్డాడు. దీంతో ఆ జవాన్‌ కోసం ఆర్మీ బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. రాష్ట్రంలోని బార్డర్‌ వద్ద. పెట్రోలింగ్‌ పార్టీ నదిపై నుంచి ఉన్న ఓ వంతెన దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నదిలో జారిపడ్డ జవాన్‌ను ట్రిపీక్ బ్రిగేడ్‌కు చెందిన లాన్స్ హవాల్దార్ ప్రకాశ్ రాళ్ల అని ఆర్మీ అధికారులు గుర్తించారు. నదిలో జవాన్‌ జారిపడిన విషయం తెలియగానే.. సైనికులు నది సమీపంలో రెస్క్యూ ఆపరేషన్ […]

నదిలో జారిపడ్డ జవాన్‌.. విస్తృతంగా కొనసాగుతున్న గాలింపు..
Follow us on

ప్రమాదవశాత్తూ ఓ ఆర్మీ జవాన్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని సట్లేజ్‌ నదిలో జారిపడ్డాడు. దీంతో ఆ జవాన్‌ కోసం ఆర్మీ బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. రాష్ట్రంలోని బార్డర్‌ వద్ద. పెట్రోలింగ్‌ పార్టీ నదిపై నుంచి ఉన్న ఓ వంతెన దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నదిలో జారిపడ్డ జవాన్‌ను ట్రిపీక్ బ్రిగేడ్‌కు చెందిన లాన్స్ హవాల్దార్ ప్రకాశ్ రాళ్ల అని ఆర్మీ అధికారులు గుర్తించారు.

నదిలో జవాన్‌ జారిపడిన విషయం తెలియగానే.. సైనికులు నది సమీపంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. తొలుత పెట్రోలింగ్ పార్టీ టీం రెస్క్యూ స్టార్ట్‌ చేయగా.. ఆ తర్వాత మరో 200 మంది సిబ్బంది.. నదిలో గాలింపు చేపట్టారు. అయితే నదిలో నీటిమట్టం ఎక్కువగా ఉండటంతో.. సర్చ్ ఆపరేషన్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ జవాన్‌ ప్రకాశ్‌ కోసం గాలింపు కొనసాగిస్తున్నట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సిబ్బంది సర్చ్ ఆపరేషన్‌ ఓ వైపు కొనసాగుతుండగానే.. మరోవైపు డ్రోన్లు, ప్రత్యేక నిఘా హెలికాప్టర్లతో పాటు స్పెషల్ ఫోర్స్, గజ ఈతగాళ్లతో కూడా ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.