AP Panchayat Elections 2021: పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదంటూ సుప్రీంలో తన వాదన వినిపించనున్న ఏపీ సర్కర్

|

Jan 22, 2021 | 10:41 AM

ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి అనిశ్చితి నెలకొంది. ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ ప్రభుత్వం మధ్య యుద్ధం సుప్రీం కోర్టుకు చేరుకుంది...

AP Panchayat Elections 2021: పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదంటూ సుప్రీంలో తన వాదన వినిపించనున్న ఏపీ సర్కర్
Follow us on

AP Panchayat Elections 2021:  ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి అనిశ్చితి నెలకొంది. ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ ప్రభుత్వం మధ్య యుద్ధం సుప్రీం కోర్టుకు చేరుకుంది. ఏపీలో పంచాయతీ ఎన్నికల పిటిషన్ ను త్వరగా విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టును కోరనున్నారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆ పిటిషన్ లో పేర్కొంది.

స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపేయాలని స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ లో అభ్యర్ధించింది. వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికలంటే ప్రజల ప్రాణాలు పణంగా పెట్టడమే అని కోర్టుకు విన్నవించనుంది ఏపీ సర్కార్. ఫిబ్రవరి మొదటి వారంలో పోలీసులకు వ్యాక్సిన్‌ కార్యక్రమం ఉన్నందున ఆ సమయంలో వారు ఎన్నికల విధుల్లో పాల్గొనలేరని తెలపనున్నది. కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ కార్యక్రమం వీటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని వివరణ ఇవ్వనున్నది.. అంతేకాదు.. ఎన్నికల కమిషనర్‌ దురుద్దేశంతోనే ఎన్నికల షెడ్యూల్‌ ని ప్రకటించారంటూ సుప్రీం కోర్టు లో తన వాదన వినిపించనుంది.

Also Read: అద్భుతమైన స్త్రీతో అందమైన రోజు. ప్రేమతో.. పుట్టిన రోజు శుభాకాంక్షలు లేడీ బాస్ : మహేష్ బాబు