తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడన ముప్పు!

| Edited By: Pardhasaradhi Peri

Jun 16, 2020 | 9:56 AM

తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ముప్పు పొంచివుందని వాతావరణశాఖ తెలిపింది..ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతంమై జూన్ 19వ అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర అండమాన్ తీరంలో 5.8 నుండి 7.6 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడన ముప్పు!
Follow us on

తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ముప్పు పొంచివుందని వాతావరణశాఖ తెలిపింది..ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతంమై జూన్ 19వ అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది.. ఉత్తర అండమాన్ తీరంలో 5.8 నుండి 7.6 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది..రేపు మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది..రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ చెబుతుంది.. నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర వరకు చేరుకున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు ఎక్కడిక్కడ నగారాలను ముంచెత్తున్నాయి. రాగల మూడురోజుల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి.. రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, ఒడిశా, చత్తీస్ గఢ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. తమిళనాడులో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. అరేబియా సముద్రంలోకి మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.