UP News: రైలు పట్టాలపై ఎర్ర చీర కట్టి.. పెను ప్రమాదాన్ని తప్పించింది.. ఆమె చేసిన పనికి శెభాష్ అంటున్న నెటిజన్లు

|

Apr 03, 2022 | 7:57 AM

పొలానికి వెళ్లేందుకు ఆమెకు ఆ మార్గమే అలవాటు. రోజూ అదే రూట్లో పొలానికి వెళ్లి పనులు చేసుకునేది. రోజూవారీ లాగే వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు బయల్దేరింది. రోజూ వెళ్లే మార్గంలోని రైలు పట్టాలపై నడుచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో...

UP News: రైలు పట్టాలపై ఎర్ర చీర కట్టి.. పెను ప్రమాదాన్ని తప్పించింది.. ఆమె చేసిన పనికి శెభాష్ అంటున్న నెటిజన్లు
Train Accident Alert
Follow us on

పొలానికి వెళ్లేందుకు ఆమెకు ఆ మార్గమే అలవాటు. రోజూ అదే రూట్లో పొలానికి వెళ్లి పనులు చేసుకునేది. రోజూవారీ లాగే వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు బయల్దేరింది. రోజూ వెళ్లే మార్గంలోని రైలు పట్టాలపై నడుచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో ఆమెకు ఓ దృశ్యం కనిపించింది. రైలు పట్టా విరిగి ఉండటం చూసి హతాశురాలయ్యింది. ట్రాక్ పై రైలు వస్తే పెను ప్రమాదం తప్పదని భయపడింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులను చెప్పాలనుకుంది. కానీ ఆమె వద్ద సమాచారం అందించేందుకు ఎలాంటి వస్తువులు, పరికరాలూ లేవు. దీంతో సమయస్పూర్తితో ఆలోచించింది. తాను కట్టుకున్న చీరనే(Saree) రైలు పట్టాలకు అడ్డంగా కట్టింది. ఆ మార్గంలో వస్తున్న రైలు(Train) ను ఆపింది. చాకచక్యంగా వ్యవహరించి వందల మంది ప్రాణాలు కాపాడిన ఆ మహిళను పలువురు ప్రశంసల్లో ముంచెత్తారు. ఉత్తరప్రదేశ్(Uttara Pradesh) రాష్ట్రంలోని​ఎటా జిల్లాలోని గులేరియా గ్రామానికి చెందిన ఓంవతీ దేవి రైలు పట్టాల మీదుగా పొలానికి వెళ్తోంది. కుస్బా రైల్వేస్టేషన్​ సమీపంలో ఒక పట్టా విరిగి ఉండడాన్ని గమనించింది. ఈ మార్గంలో రైలు వస్తే జరిగే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి.. ప్రమాదం జరగకుండా కాపాడాలని నిర్ణయించుకుంది. పట్టా విరిగినట్లు సమాచారం రైల్వే అధికారులకు ఎలా ఇవ్వాలో ఆమెకు తెలియలేదు.

ఎంతో సమయస్ఫూర్తితో ఆలోచించిన ఓంవతీ దేవి.. తాను కట్టుకున్న ఎర్ర చీరను విప్పి పట్టాలపై నిల్చుంది. పట్టాలకు అడ్డంగా ఎర్ర చీరను కట్టింది. కాసేపటికే ఆ మార్గంలో ఓ ప్యాసింజర్ రైలు వచ్చింది. పట్టాలకు అడ్డంగా ఉన్న ఎర్రటి వస్త్రాన్ని గమనించిన లోకో పైలట్ రైలును ఆపాడు. కిందికి దిగి చూడగా పట్టా విరిగి ఉంది. పక్కనే ఓంవతీ దేవి నిల్చుని ఉంది. రైలు పట్టా దెబ్బతిన్నట్టు లోకోపైలట్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. చీర సాయంతో వందల మంది ప్రాణాలు కాపాడిన బామ్మను అభినందనలు, ప్రశంసలతో ముంచెత్తారు. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే ఉన్నతాధికారులు విరిగిన రైలు పట్టాను సరిచేశారు. గంట తర్వాత రైలు ప్రయాణం తిరిగి ప్రారంభమైంది. ఇంతకు ముందు టుండ్లా నుంచి ఎటాకు ఇదే రైలు వెళ్లిందని, అప్పుడే పట్టా దెబ్బతిని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

నేను పొలానికి వెళ్తున్న సమయంలో రైలు పట్టా విరిగి ఉండటాన్ని గమనించా. ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే నాకొక ఉపాయం తట్టింది. నేను కట్టుకున్న ఎర్రచీరతో రైలును ఆపేందుకు ప్రయత్నించాలని అనుకున్నా. వెంటనే అప్రమత్తమై పట్టాలకు అడ్డంగా ఎర్ర చీరను కట్టాను. అదే సమయంలో రైలు వచ్చింది. వస్త్రాన్ని చూసి లోకోపైలట్ రైలును ఆపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్​ నాకు రూ.100 బహుమానంగా ఇచ్చాడు. నేను వద్దని చెప్పినా తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు.

                           – ఓంవతీ దేవి

Also Read

TRS: సొంత పార్టీ వారే ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

Covid 19 New Variant: వేగంగా దూసుకొస్తున్న మరో కొత్త వేరియంట్.. బ్రిట‌న్‌లో వెలుగుచూసిన ఎక్స్ఈః డ‌బ్ల్యూహెచ్‌వో

Crude Oil: ముడి చమురు సరఫరా పెంచుతామన్న IEA.. పెట్రోల్, డీజిల్‌ రేట్లు తగ్గుతాయా..?