హిందుఖుష్‌ ప్రాంతంలో భూ ప్రకంపనలు

| Edited By:

Jul 11, 2020 | 2:09 PM

ఓ వైపు యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో వణికిపోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రకృతి కూడా ఇదే సమయంలో ప్రజల్ని వణికిస్తోంది. నిత్యం ఎక్కడో ఓ చోట.. వరదల రూపంలోనో.. లేక భారీ వర్షాల..

హిందుఖుష్‌ ప్రాంతంలో భూ ప్రకంపనలు
Follow us on

ఓ వైపు యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో వణికిపోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రకృతి కూడా ఇదే సమయంలో ప్రజల్ని వణికిస్తోంది. నిత్యం ఎక్కడో ఓ చోట.. వరదల రూపంలోనో.. లేక భారీ వర్షాల రూపంలోనో ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది.అంతేకాదు.. గత కొద్ది రోజులుగా భూ ప్రకంపనలు కూడా ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా మన దేశంలో ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరోవైపు బిహార్‌ రాష్ట్ర పరిసరాల్లో పిడుగులు పడుతుండటంతో ప్రజలు భయంతో జీవనం సాగిస్తున్నారు. తాజాగా.. శనివారం ఉదయం హిందుఖుష్‌ ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఉదయం 9.50 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. కాగా, ఇప్పటికే గత వారం రోజుల్లో అసోం, లదాఖ్, కశ్మీర్‌, నాగాలాండ్‌లోని పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ భూకంప తీవ్రత తక్కువ ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదు.