ఆమ్రపాలికి అరుదైన అవకాశం.. పీఎంవోలో స్థానం

| Edited By:

Sep 13, 2020 | 11:20 AM

యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో ఆమె స్థానం దక్కించుకుంది.

ఆమ్రపాలికి అరుదైన అవకాశం.. పీఎంవోలో స్థానం
Follow us on

IAS Amrapali news: యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం(పీఎంవో)లో ఆమె స్థానం దక్కించుకుంది. పీఎంలో తాజాగా ముగ్గురు ఐఏఎస్‌లు స్థానం దక్కించుకోగా.. ఆమ్రపాలి డిప్యూటీ కార్యదర్శిగా నియమితులు అయ్యారు. 2023 అక్టోబర్ 27 వరకు అమ్రపాలి ఆ స్థానంలో కొనసాగనున్నారు. ఈ మేరకు అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమ్రపాలితో పాటు పీఎంవో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్ సెక్రటరీగా మంగేశ్ గిల్దియాల్‌ నియమితులు అయ్యారు.

అయితే 2010 బ్యాచ్ ఏపీ కేడర్‌కి చెందిన ఆమ్రపాలి.. గతంలో వికారాబాద్ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలు అందించారు. ఆ తరువాత కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లి.. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

Read More:

హైదరాబాద్, దుబాయ్‌ల మధ్య విమానాలు షురూ

Bigg Boss 4: నోయల్‌కి సూచన.. కరాటే కళ్యాణిపై ఫైర్‌