నిరుద్యోగులకు అమెజాన్‌ ఆఫర్‌…త్వరలో ఖాళీల భర్తీ

|

Jul 27, 2020 | 7:30 PM

కరోనా దెబ్బతో అన్ని కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న వేళ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ, రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ మాత్రం నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

నిరుద్యోగులకు అమెజాన్‌ ఆఫర్‌...త్వరలో ఖాళీల భర్తీ
Follow us on

కరోనా దెబ్బతో అన్ని కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న వేళ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ, రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ మాత్రం నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఐర్లాండ్‌లోని అమెజాన్‌ కార్యాలయంలో 1,000 మంది ఖాళీలకు త్వరలో నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. అయితే, క్లౌడ్‌ సేవలకు (డిజిటల్‌) డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ పేర్కొంది. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో నూతన అమెజాన్‌ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. కాగా, కొత్తగా నియమించుకునే వారు బిగ్‌డేటా స్పెషలిస్టులు, ప్రోగ్రామ్ మేనేజర్లు తదితర విభాగాలలో సేవలందించాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు అమెజాన్‌ సాంకేతికను అద్భుతంగా ఉపయోగించుకుంటుందని ఐర్‌ల్యాండ్‌కు చెందిన అమెజాన్‌ మేనేజర్‌ మైక్‌ బియరీ పేర్కొన్నారు.