దున్నపోతుకు పాలు తీస్తున్న అమరావతి రైతులు..!

|

Dec 21, 2019 | 7:48 PM

జీఎన్‌ రావు కమిటీ నివేదికపై అమరావతి రైతులు మండిపడుతున్నారు. రాజధాని నిర్మిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగుతున్నారు. మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా గుంటూరులో రైతులు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. దున్నపోతు పాలన వద్దు అంటూ మందడంలో రైతులు దున్నపోతుతో నిరసన తెలిపారు. దున్నపోతుకు పాలు తీస్తునట్లు వినూత్నంగా నిరసన తెలియజేశారు. మరోవైపు మందడంలో రోడ్లపై బైఠాయించిన రైతుల దీక్ష కొనసాగించారు. కుటుంబాలతో సహా రైతులు […]

దున్నపోతుకు పాలు తీస్తున్న అమరావతి రైతులు..!
Follow us on

జీఎన్‌ రావు కమిటీ నివేదికపై అమరావతి రైతులు మండిపడుతున్నారు. రాజధాని నిర్మిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగుతున్నారు. మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా గుంటూరులో రైతులు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. దున్నపోతు పాలన వద్దు అంటూ మందడంలో రైతులు దున్నపోతుతో నిరసన తెలిపారు. దున్నపోతుకు పాలు తీస్తునట్లు వినూత్నంగా నిరసన తెలియజేశారు. మరోవైపు మందడంలో రోడ్లపై బైఠాయించిన రైతుల దీక్ష కొనసాగించారు. కుటుంబాలతో సహా రైతులు రోడ్డుపై బైటాయించారు. చిన్న పిల్లలు కూడా నిరసనలో పాల్గొన్నారు. రైతుల ఆందోళనకు టీడీపీ నేతలు పలువురు మద్దతు తెలియజేశారు.