హై అలర్ట్.. ఏ క్షణాన్నైనా పాక్ కమాండోల చొరబాటు..?

| Edited By:

Aug 29, 2019 | 5:46 PM

పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శిస్తోంది. ఓ వైపు ఎల్ఓసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. దేశంలోకి ఉగ్రవాదులను చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే బార్డర్లో భద్రత కట్టుదిట్టం చేయడంతో పాక్ కొత్త దారులను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలు చూస్తే అది స్పష్టంగా తెలుస్తోంది. సముద్ర మార్గం గుండా పాక్ కమాండోలు, ఉగ్రవాదులు భారత్ భూభాగంలోకి చొరబడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు.. హెచ్చరికలు జారీ […]

హై అలర్ట్.. ఏ క్షణాన్నైనా పాక్ కమాండోల చొరబాటు..?
Follow us on

పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శిస్తోంది. ఓ వైపు ఎల్ఓసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. దేశంలోకి ఉగ్రవాదులను చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే బార్డర్లో భద్రత కట్టుదిట్టం చేయడంతో పాక్ కొత్త దారులను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలు చూస్తే అది స్పష్టంగా తెలుస్తోంది. సముద్ర మార్గం గుండా పాక్ కమాండోలు, ఉగ్రవాదులు భారత్ భూభాగంలోకి చొరబడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు.. హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో గుజరాత్‌ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్ఫ్‌ ఆఫ్‌ కచ్‌‌, సర్‌ క్రీక్‌ ప్రాంతం నుంచి పాక్‌ కమాండోలు లేదా ఉగ్రవాదులు చిన్న చిన్న పడవల ద్వారా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చిరించాయి. భారత నేవీకి చెందిన షిప్స్‌పై దాడులు జరిపేందుకు పాకిస్థాన్ కుతంత్రాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఆ దేశ కమాండోలు, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో దేశ వ్యాప్తంగా తీర ప్రాంత సిబ్బందిని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా గుజరాత్‌లోని అన్ని పోర్టులకు హైఅలర్ట్ ప్రకటించారు. అటు గోవా తీరంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గరి నుంచి మన దేశానికి ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తునే ఉన్నాయి. కశ్మీర్‌ సహా దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ కుట్రలు చేస్తోందని నిఘా సంస్థలు వెల్లడించాయి.