Delhi Pollution Control Committee: నేచురల్ గ్యాస్‌కు మారండి.. ఢిల్లీ పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి సూచన..

| Edited By:

Dec 23, 2020 | 7:56 AM

దేశ రాజధానిలో రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి కీలక ప్రతిపాదనలు, సూచనలు చేసింది.

Delhi Pollution Control Committee: నేచురల్ గ్యాస్‌కు మారండి.. ఢిల్లీ పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి సూచన..
Follow us on

దేశ రాజధానిలో రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి కీలక ప్రతిపాదనలు, సూచనలు చేసింది. ఢిల్లీలోని 50 పారిశ్రామిక వాడలు దేశ రాజధానిలో అధిక కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తించాయి. దాదాపు 1644 పరిశ్రమలు పెద్ద మొత్తంలో కాలుష్య ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కీలక సూచనలు చేసింది.

నేచురల్ గ్యాస్‌కు మారండి….

ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో కాలుష్య నివారణ కోసం గెయిల్(గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్), ఇంద్రపరిషత్ గ్యాస్ లిమిటెడ్ తో కలిసి ప్రభుత్వం ఓ సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం కీలక సూచనలు చేసింది. కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలు వచ్చే ఏడాది జనవరి 31 కల్లా నేచురల్ గ్యాస్‌ను వినియోగించుకోవాలని సూచించింది. అంతే కాకండా పరిశ్రమల్లో రసాయనాలు, కాలుష్య కారక ఇంధనాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. జరిమానాలు కూడా విధిస్తామని పేర్కొంది.