విపక్షాల తీరుపై అలిగి, సభ నుంచి వెళ్ళిపోయిన రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్కడ్‌.. ఎందుకంటే?

|

Aug 08, 2024 | 8:07 PM

భారత రెజ్లర్ వినేశ్‌ ఫోగట్‌కు జరిగిన అన్యాయంపై రాజ్యసభ దద్దరిల్లింది. విపక్షాల తీరుపై అలిగారు రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్కడ్‌. సభ నుంచి వెళ్లిపోయారు. విపక్షాల తీరుతో వినేశ్‌ ఫోగట్‌కు న్యాయం జరగదన్నారు జగ్‌దీప్‌ ధన్కడ్‌.

విపక్షాల తీరుపై అలిగి, సభ నుంచి వెళ్ళిపోయిన రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్కడ్‌.. ఎందుకంటే?
Rajyasabha Chairman Jagadeep Dhankar
Follow us on

భారత రెజ్లర్ వినేశ్‌ ఫోగట్‌కు జరిగిన అన్యాయంపై రాజ్యసభ దద్దరిల్లింది. విపక్షాల తీరుపై అలిగారు రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్కడ్‌. సభ నుంచి వెళ్లిపోయారు. విపక్షాల తీరుతో వినేశ్‌ ఫోగట్‌కు న్యాయం జరగదన్నారు జగ్‌దీప్‌ ధన్కడ్‌.

రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్కడ్‌కు కోపం వచ్చింది. ఒలింపిక్స్‌లో వినేష్‌ ఫొగట్‌ అనర్హతపై రాజ్యసభలో నిరసనలు వెల్లువెత్తాయి.అనర్హత వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని ఉందని విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. దీనికి సభాధ్యక్షుడు జగదీప్‌ ధన్కడ్‌ అనుమతించలేదు. ఇదే క్రమంలో TMC సభ్యులు నినాదాలు చేయడంతో సభాధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విపక్ష సభ్యులందరూ వాకౌట్‌ చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఆవేదనకు గురైన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కడ్‌ కాసేపు సభ నుంచి వెళ్లిపోయారు. విపక్ష ఎంపీల తీరుతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వినేశ్‌ ఫోగట్‌కు న్యాయం దక్కదన్నారు జగ్‌దీప్‌ ధన్కడ్‌.

మరోవైపు ఫోగట్‌కు న్యాయం దక్కలేదని , కేంద్రం ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని విపక్షాలు కోరుతున్నాయి . వినేశ్‌ అనర్హతకు దారితీసిన పరిస్థితులపై చర్చకు రాజ్యసభ లో విపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకు ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ నిరాకరించడంతో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. వినేశ్‌ గురంచి విపక్షాల మాత్రమే కాదు దేశమంతా బాధపడుతోందన్నారు జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌. దీనిపై రాజకీయం చేస్తే ఆమెను అవమానపర్చినట్టేనని అన్నారు. వినేశ్‌ ఫోగట్‌కు దేశమంతా అండగా ఉంటుందని సభలోనే ప్రకటించారు కేంద్రమంత్రి జేపీ నడ్డా. ఈ విషయంలో ఎవరు కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని మోదీ కూడా ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించారు. వినేశ్‌ ఫోగట్‌కు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని భారత ఒలింపిక్‌ సంఘం ప్రెసిడెంట్‌ పీటీ ఉషను కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..