భారత్‌లో ఆఫ్రికన్ స్వైన్‌ ఫ్లూ.. 2,500 పందులు మృత్యువాత..!

| Edited By:

May 04, 2020 | 8:37 AM

అసోంలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ బారిన పడి 2500 పందులు మృత్యువాతపడ్డాయి. ఏడు జిల్లాల్లోని 306 గ్రామాల్లో ఈ వ్యాధి బయటపడింది.

భారత్‌లో ఆఫ్రికన్ స్వైన్‌ ఫ్లూ.. 2,500 పందులు మృత్యువాత..!
Follow us on

అసోంలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ బారిన పడి 2500 పందులు మృత్యువాతపడ్డాయి. ఏడు జిల్లాల్లోని 306 గ్రామాల్లో ఈ వ్యాధి బయటపడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పందులను సామూహికంగా చంపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అయితే తాము ఆ పని చేయబోమని అసోం ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ విధానాల్లో వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు తెలిపింది. వ్యాధి బారిన పడిన పందులను మాత్రమే చంపేస్తామని వెల్లడించింది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపదని.. వ్యాధి ఉనికి లేని ప్రాంతాల్లో పంది మాంసం తినొచ్చని స్పష్టం చేసింది. కాగా పందుల్లో అత్యంత ప్రమాదకర అంటువ్యాధుల్లో స్వైన్ ఫ్లూ ఒకటి.

Read This Story Also: యాక్టింగ్‌తో మెప్పిస్తోన్న పవన్, రేణుల‌ తనయ ఆధ్య.. వీడియో వైరల్..!