పోలీసుల ఎదుట లొంగిపోయిన రెహానా ఫాతిమా

| Edited By:

Aug 09, 2020 | 7:17 AM

ఉద్యమకారిణి రెహానా ఫాతిమా చివరకు తన రూట్ మార్చింది. శనివారం నాడు కొచ్చి పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. ఆమె గతంలో తన అర్ధ నగ్న శరీరంపై మైనర్ పిల్లల చేత బొమ్మలు..

పోలీసుల ఎదుట లొంగిపోయిన రెహానా ఫాతిమా
Follow us on

ఉద్యమకారిణి రెహానా ఫాతిమా చివరకు తన రూట్ మార్చింది. శనివారం నాడు కొచ్చి పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. ఆమె గతంలో తన అర్ధ నగ్న శరీరంపై మైనర్ పిల్లల చేత బొమ్మలు గీయించుకున్న సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా.. దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై రెహానా ఫాతిమాపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు కోర్టు బెయిల్ తిరస్కరించడంతో మళ్లీ న్యాయ వ్యవస్థపై మరో వివాదాస్పద వీడియో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్థానిక న్యాయవాది కోర్టుకు విన్నవిస్తూ.. ఆమెను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఆమె పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె స్వయంగా శనివారం నాడు పోలీసుల సమక్షంలో లొంగిపోయారు.

Read More :

మహారాష్ట్రలో 5లక్షలు దాటిన కేసులు

దేశ రాజధానిలో పేలిన సిలిండర్‌.. 14 మందికి గాయాలు