అవి తప్పుడు పత్రాలు.. ఆ బీజేపీ అభ్యర్ధి నామినేషన్ రిజెక్ట్ చెయ్యాల్సిందే..

| Edited By:

Jan 23, 2020 | 12:58 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పర్వం ముగిసిన విషయం తెలిసిందే. ఇక నామినేషన్ పత్రాల పరిశీలన.. బుధవారం జరిగింది. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్ధి నామినేషన్ పత్రాన్ని రిజెక్ట్ చెయ్యాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఈసీని కొరింది. మోడల్‌ టౌన్‌ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధి కపిల్‌ మిశ్రా..తప్పుడు నామినేషన్‌ పత్రాలు సమర్పించాడంటూ ఆప్ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి ఢిల్లీ ఎన్నికల అధికారికి లేఖ కూడా రాసింది. కపిల్ మిశ్రా సమర్పించిన నామినేషన్‌ పత్రాల్లో చాలా […]

అవి తప్పుడు పత్రాలు.. ఆ బీజేపీ అభ్యర్ధి నామినేషన్ రిజెక్ట్ చెయ్యాల్సిందే..
Follow us on

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పర్వం ముగిసిన విషయం తెలిసిందే. ఇక నామినేషన్ పత్రాల పరిశీలన.. బుధవారం జరిగింది. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్ధి నామినేషన్ పత్రాన్ని రిజెక్ట్ చెయ్యాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఈసీని కొరింది. మోడల్‌ టౌన్‌ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధి కపిల్‌ మిశ్రా..తప్పుడు నామినేషన్‌ పత్రాలు సమర్పించాడంటూ ఆప్ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి ఢిల్లీ ఎన్నికల అధికారికి లేఖ కూడా రాసింది.

కపిల్ మిశ్రా సమర్పించిన నామినేషన్‌ పత్రాల్లో చాలా వరకు తప్పుడు సమాచారం ఉందని.. అతను దాఖలు చేసిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అతడి నామినేషన్‌ను రిజెక్ట్ చెయ్యాలని పేర్కొంది. కాగా, ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 11న రిజల్ట్స్ వెలువడనున్నాయి.