Video: మూసలోడే కానీ..! ఇదేం పోయేకాలం.. పట్టపగలు నడి రోడ్డుపై మహిళను..! CCTVలో నీచపు పనంతా రికార్డ్‌..

ముజఫర్‌నగర్‌లో 55 ఏళ్ల వ్యక్తి ఒక మహిళను అసభ్యంగా తాకిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు గతం లోనూ ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలిసింది.

Video: మూసలోడే కానీ..! ఇదేం పోయేకాలం.. పట్టపగలు నడి రోడ్డుపై మహిళను..! CCTVలో నీచపు పనంతా రికార్డ్‌..
Muzaffarnagar Cctv Footage

Updated on: Jun 30, 2025 | 8:36 PM

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో 55 ఏళ్ల వ్యక్తి ఓ మహిళను అసభ్యంగా తాకి తన పైశాచికంగా ప్రవర్తించాడు. ఊహించని ఘటనతో ఉలిక్కిపడ్డ ఆ మహిళ.. తనపై చేయి వేసిన ఆ మూసలోడ్ని.. వెంబడించి మరీ కొట్టింది. ఇదంతా పట్టపగలు, నడిరోడ్డుపై జరిగింది. ఆ రోడ్డు పక్కనే ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో ఇదంతా రికార్డ్‌ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నా్యి.. ముజఫర్ నగర్ లోని ఖలాపర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సిటీ సెంటర్ ముందు ఓ మహిళ ఎక్కడికో వెళ్లేందుకు నిలబడింది. ఇంతలో వెనుక నుండి వస్తున్న రియాజ్ అనే 55 ఏళ్ల వ్యక్తి ఆ యువతిని అసభ్యకరంగా తాకాడు. వృద్ధుడి దుష్ట చర్యను నిరసిస్తూ, ఆ మహిళ అతన్ని వెంబడించి కొట్టింది.

ఈ సంఘటన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. అది కాస్త వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వైరల్‌ వీడియోను సుమోటోగా స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. 50 కి పైగా కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత నిందితుడు రియాజ్‌ను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు గతంలో రోడ్డుపై నడుస్తున్న అమ్మాయిలను కూడా ఇలాగే అసభ్యకరంగా తాకినట్లు తేలింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ప్రశ్నించడం ప్రారంభించారు. విచారణలో నిందితురాలు ఆమెను అసభ్యకరంగా తాకినట్లు అంగీకరించాడు. అయితే ఇప్పటివరకు అతనిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి