Corona Vaccination: దేశంలో ఒక్క రోజే 5 లక్షల మందికి కోవిడ్‌ టీకా.. ఇప్పటి వరకు 28,47,608 టీకాల పంపిణీ

|

Jan 29, 2021 | 5:32 AM

Corona Vaccination: భారత్‌లో కరోనా టీకా పంపిణీ వేగవంతంగా కొనసాగుతోంది. ఈనెల 16న దేశ వ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ 13వ రోజు విజయవంతంగా.

Corona Vaccination: దేశంలో ఒక్క రోజే 5 లక్షల మందికి కోవిడ్‌ టీకా.. ఇప్పటి వరకు 28,47,608 టీకాల పంపిణీ
Follow us on

Corona Vaccination: భారత్‌లో కరోనా టీకా పంపిణీ వేగవంతంగా కొనసాగుతోంది. ఈనెల 16న దేశ వ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ 13వ రోజు విజయవంతంగా జరిగింది. గురువారం ఒక్క రోజే దాదాపు 5 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి టీకా వేసినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం రాత్రి వరకు 4,91,615 మందికి కరోనా టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 28,47,608 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

అలాగే ఏపీ నుంచి 1,70,910 మంది, తెలంగాణ నుంచి 1,46,665 మందికి టీకాలు వేసినట్లు తెలిపింది. 13 రాష్ట్రాల్లో లక్షకు మించి వ్యాక్సిన్‌ పంపిణీ జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 2,84,979 మందికి టీకా అందించగా, తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఒడిశౄ, పశ్చిమ బెంగాల్‌, ఏపీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, తెలంగాణ, హర్యానా, బీహార్‌, కేరళ ఉన్నాయి.

Also Read: Corona Vaccine: శ్రీలంకకు ఐదు లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను బహుమతిగా పంపిన భారత ప్రభుత్వం