Naxals Surrender: ఫలిస్తున్న పోలీసుల వ్యూహం.. 44 మంది మావోయిస్టుల లొంగుబాటు..

|

Jan 02, 2022 | 6:48 AM

44 Naxals surrender in Sukma: వనం వీడండి, జనం మధ్య జీవించండి.. అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా భారీ సంఖ్యలో జనజీవనంలోకి వచ్చారు

Naxals Surrender: ఫలిస్తున్న పోలీసుల వ్యూహం.. 44 మంది మావోయిస్టుల లొంగుబాటు..
Naxals Surrender
Follow us on

44 Naxals surrender in Sukma: వనం వీడండి, జనం మధ్య జీవించండి.. అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా భారీ సంఖ్యలో జనజీవనంలోకి వచ్చారు మావోయిస్టులు. దండకారణ్యంలో ఉంటూ పోరాడుతున్న మావోయిస్టులు అరణ్యం వీడాలని, జనం మధ్యకు వచ్చి జీవించాలని పోలీసులు ఎప్పటికప్పుడు పిలుపునిస్తున్నారు. వారికి సరైన అవకాశాలు కల్పించి, గౌరవంగా జీవించేలా చూస్తామని ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి. దీంతో చాలామంది వనం వీడి, జనం మధ్యకు వస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల లొంగిపోయారు. మొత్తం 44 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు ప్రకటించారు పోలీసులు. వారిలో 9 మంది మహిళలు ఉన్నారు. చింతల్నార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సుకుమా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.

ఈ ప్లాటూన్ దళంపై 2 లక్షల రివార్డు కూడా ఉంది. కరిగుండం క్యాంపు తర్వాత పోలీసులు తొలి విజయం సాధించారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులు, గ్రామస్తులతో కలిసి సుకుమా పోలీసులు భోజనాలు చేశారు. సుక్మా జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పున నాకం అభియాన్‌ ప్రభావంతో లొంగిపోయినట్లు తెలుస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులు అందరికీ ప్రభుత్వం పునరావాస పథకాలను అందజేస్తుందని ఛత్తీస్‌గడ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ తెలిపారు.

Also Read:

Spice jet Offer: రూ. 1122కి విమాన ప్రయాణం.. స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్‌ జనవరి 5వరకు పొడిగింపు

Omicron Cases in India: ఒమిక్రాన్‌పై రాష్ట్రాలకు సూచనలు.. కీలక చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం లేఖలు..!