పాలఘర్‌ ఎఫెక్ట్.. 35 మంది పోలీసులు బదిలీ.. ముగ్గురు సస్పెండ్‌..

| Edited By:

Apr 29, 2020 | 9:03 PM

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్‌ఘర్ మూకదాడి గురించి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు సాధువులతో పాటు.. ఒక డ్రైవర్‌ కూడా ప్రాణాలు విడిచారు. అయితే ఈ మూకదాడి జరుగుతున్న సమయంలో కొందరు పోలీసులు అక్కడే ఉండి కూడా.. వారిని కాపాడే ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. సీఎం ఉద్దవ్‌ థాక్రేకు ఫోన్ చేశారు. దీంతో వెంటనే సీరియస్‌ […]

పాలఘర్‌ ఎఫెక్ట్.. 35 మంది పోలీసులు బదిలీ.. ముగ్గురు సస్పెండ్‌..
Follow us on

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్‌ఘర్ మూకదాడి గురించి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు సాధువులతో పాటు.. ఒక డ్రైవర్‌ కూడా ప్రాణాలు విడిచారు. అయితే ఈ మూకదాడి జరుగుతున్న సమయంలో కొందరు పోలీసులు అక్కడే ఉండి కూడా.. వారిని కాపాడే ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. సీఎం ఉద్దవ్‌ థాక్రేకు ఫోన్ చేశారు. దీంతో వెంటనే సీరియస్‌ అయిన మహా సర్కార్ ఘటనకు సంబంధించి110 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 9 మంది మైనర్లు కూడా ఉండటంతో.. వారిని జువైనల్‌కు తరలించారు. అయితే పాల్‌ఘర్ ఘటనకు సంబంధించి కసా పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన పోలీసు సిబ్బందిపై ఆరోపణలు రావడంతో.. అధికారులు ఏకంగా 35 మంది పోలీస్‌ సిబ్బందిని బదిలీ చేశారు. మరో ముగ్గుర్ని సస్పెండ్ చేశారు