బ్రేకింగ్.. పాక్‌పై భారత్ గుండ్ల వర్షం.. ముగ్గురు పాక్ జవాన్లు హతం.. ఇంకా..

| Edited By:

May 08, 2020 | 5:06 PM

కరోనా వేళ పాక్ కవ్వింపు చర్యలను ఆపట్లేదు. ఓ వైపు కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతుంటే.. పాకిస్థాన్ తన వక్రబుద్దిని చూపిస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను దేశంలో చోరబడేలా చేసేందుకు.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. నిత్యం నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు దిగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు.. పాకిస్థాన్ సైన్యానికి భారత సైన్యం తమ సత్తా ఎంటో రుచిచూపించింది. పుంచ్ సెక్టార్‌లోని ఎల్వోసీ వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు […]

బ్రేకింగ్.. పాక్‌పై భారత్ గుండ్ల వర్షం.. ముగ్గురు పాక్ జవాన్లు హతం.. ఇంకా..
Follow us on

కరోనా వేళ పాక్ కవ్వింపు చర్యలను ఆపట్లేదు. ఓ వైపు కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతుంటే.. పాకిస్థాన్ తన వక్రబుద్దిని చూపిస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను దేశంలో చోరబడేలా చేసేందుకు.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. నిత్యం నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు దిగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు.. పాకిస్థాన్ సైన్యానికి భారత సైన్యం తమ సత్తా ఎంటో రుచిచూపించింది. పుంచ్ సెక్టార్‌లోని ఎల్వోసీ వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడింది. దీంతో భారత సైన్యం.. పాకిస్థాన్‌పై ఎదురు కాల్పులకు దిగింది. పాక్‌ ఔట్‌పోస్ట్‌లపై గుండ్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ముగ్గురు లేదా నలుగురు పాకిస్థాన్ జవాన్లు హతమవ్వగా.. మరికొందరు గాయాలపాలైనట్లు సమాచారం. భారత్ జరిపిన దాడిలో దాదాపు నాలుగు పోస్టులు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. కాగా.. గురువారం నాడు పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో పుంచ్ సెక్టార్‌లో పలు భవనాలు ధ్వంసం కాగా.. ఓ సాధారణ పౌరుడు గాయపడ్డట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు.