జమ్ముకశ్మీర్‌లో భూకంపం..

| Edited By:

Jun 09, 2020 | 3:00 PM

జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 8.16 నిమిషాలకు రిక్టార్‌ స్కేల్‌పై 3.9గా నమోదైంది. జమ్ముకశ్మీర్‌కు చెందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్‌ శ్రీనగర్‌కు 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన ఉదయం 8 గంటల ప్రాంతంలో చోటుచేసుకుందని.. సౌత్‌ ఈస్ట్‌ ఆఫ్ గందర్‌బల్‌ ప్రాంతానికి 7 కిలో మీటర్ల దూరంలో కూడా మరో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే భూకంప తీవ్రత […]

జమ్ముకశ్మీర్‌లో భూకంపం..
Earthquake
Follow us on

జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 8.16 నిమిషాలకు రిక్టార్‌ స్కేల్‌పై 3.9గా నమోదైంది. జమ్ముకశ్మీర్‌కు చెందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్‌ శ్రీనగర్‌కు 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన ఉదయం 8 గంటల ప్రాంతంలో చోటుచేసుకుందని.. సౌత్‌ ఈస్ట్‌ ఆఫ్ గందర్‌బల్‌ ప్రాంతానికి 7 కిలో మీటర్ల దూరంలో కూడా మరో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే భూకంప తీవ్రత స్వల్పంగానే ఉందని.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఎక్కడ కూడా ఆస్తి నష్టం వాటిల్లలేదని తెలిపారు.

కాగా, ఉదాంపూర్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షం దాటికి ఇటీవల ఓ బ్రిడ్జ్‌ కూడా కుప్పకూలడంతో.. జమ్ము-శ్రీనగర్‌ మధ్య వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.