మహారాష్ట్రలో భూ ప్రకంపనలు.. భయం గుప్పిట్లో ప్రజలు..

| Edited By:

Jul 20, 2020 | 5:00 AM

ఓ వైపు యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా పలు ప్రాంతాలపై పగబట్టినట్లు కనిపిస్తోంది. కరోనా మహమ్మారితో ప్రజలు వణికిపోతుంటే.. మరోవైపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, పిడుగులు..

మహారాష్ట్రలో భూ ప్రకంపనలు.. భయం గుప్పిట్లో ప్రజలు..
Earthquake
Follow us on

ఓ వైపు యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా పలు ప్రాంతాలపై పగబట్టినట్లు కనిపిస్తోంది. కరోనా మహమ్మారితో ప్రజలు వణికిపోతుంటే.. మరోవైపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, పిడుగులు, భూ ప్రకంపనలు వస్తుండటంతో ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. తాజాగా మహరాష్ట్రలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఆదివారం రాత్రి 9.33 గంటలకు రాష్ట్రంలోని సతరా ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్‌ ఫర్ సిస్మాలజీ తెలిపింది.