మైనర్‌పై అఘాయిత్యం.. రక్తపు మడుగులో బాలిక.. అంబులెన్స్ వీడియోలతో సంచలనం!

మధ్యప్రదేశ్‌లోని విదిశ నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు వెలుగులోకి వచ్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలతో వైద్య విద్యార్థి విశాల్ కిరార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరికొందరు యువకుల ప్రమేయం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేశారన్న ఆరోపణలు వివాదానికి దారితీశాయి.

మైనర్‌పై అఘాయిత్యం.. రక్తపు మడుగులో బాలిక.. అంబులెన్స్ వీడియోలతో సంచలనం!
Girl Assaulted

Updated on: Nov 17, 2026 | 8:34 AM

మధ్యప్రదేశ్‌లోని విదిశ నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు వెలుగులోకి వచ్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలతో వైద్య విద్యార్థి విశాల్ కిరార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరికొందరు యువకుల ప్రమేయం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేశారన్న ఆరోపణలు వివాదానికి దారితీశాయి.

అసలేం జరిగింది?

వివరాల్లోకి వెళ్తే.. విదిశలోని ఓ ప్రముఖ ప్రాంతంలో శనివారం (నవంబర్14) రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాలిక వాంగ్మూలం ప్రకారం.. నిందితుడు తనకు బీర్ తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో ఓ మందు ఇచ్చాడని, ఆ తర్వాత తాను అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

అంబులెన్స్ వీడియోలతో కలకలం

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంబులెన్స్‌లో బాలికను ఆస్పత్రికి తరలించేందుకు నలుగురైదుగురు యువకులు ప్రయత్నించినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. మరోవైపు బాలికకు సంబంధించిన దుస్తులను ఫ్లాట్ బయట చెత్తకుండీలో పడేసి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ఆరోపణలపై అధికారిక దర్యాప్తులో పూర్తి వివరాలు తేలాల్సి ఉంది.

పోలీసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రశ్నలు

జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనూంగో ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా వీడియోలను పంచుకుంటూ, ఘటన జరిగిన తర్వాత పోలీసులు వెంటనే స్పందించకపోవడంపై ప్రశ్నలు సంధించారు. పోక్సో చట్టం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకని నిలదీశారు.

కేంద్రమంత్రి స్పందన.. నిందితుడి అరెస్ట్

ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యంపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. మరోవైపు పోలీసులు వైద్య విద్యార్థి విశాల్ కిరార్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. విదిశ ఎస్పీ రోహిత్ కాశ్వానీ పోలీసుల తరఫున వివరణ ఇచ్చారు.

మైనర్ బాలికపై జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితురాలికి న్యాయం జరగాలని, ఘటన వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us