Parliament of India: రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేస్తాం… 16 రాజకీయ పార్టీల సంయుక్త ప్రకటన..

|

Jan 28, 2021 | 2:55 PM

Parliament of India: కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు భగ్గమన్నాయి. కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Parliament of India: రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేస్తాం... 16 రాజకీయ పార్టీల సంయుక్త ప్రకటన..
Follow us on

Parliament of India: కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు భగ్గమన్నాయి. కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం కలిగిన 16 ప్రతిపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగ పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసన తెలుపాలని డిసైడ్ అయ్యాయి. ఆమేరకు గురువారం నాడు కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఒక ప్రకనటన విడుదల చేశాయి.

ప్రతిపక్షం లేకుండా చేసి, ఏకపక్షంగా చట్టాలు పాస్ చేశారని ఆ ప్రకటనలో ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాల కారణంగా ఆహర భద్రతకు విఘాతం కలుగుతుందన్నాయి. ఆహార ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించడం నిలిచిపోయి ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నాయి. ఆ కారణంగానే రైతులు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ 64 రోజులుగా ఆందోళన చేస్తున్నారని సదరు పార్టీలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ఆందోళనల్లో దాదాపు155 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, అయినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చలనం లేదని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. జనవరి 26 నాటి హింసాత్మక ఘటనలను ఖండించిన ప్రతిపక్ష పార్టీలు.. ఈ దుశ్చర్యల వెనుక అసలు కుట్రదారులెవరో తేల్చాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఇందుకోసం నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు.

ఇదిలాఉంటే.. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ సహా.. ఇతర పార్టీలు మొత్తం కలుపుకుని 16 రాజకీయ పార్టీలే రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించినప్పటికీ.. మరికొన్ని తటస్థ పార్టీలు సైతం ఈ ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేయాలని ప్రకటించిన16 ప్రధాన పార్టీలు ఇవే..
1. కాంగ్రెస్
2. ఎన్సీపీ
3. జేకేఎన్సీ
4. డీఎంకే
5. తృణమూల్ కాంగ్రెస్
6. శివసేన
7. సమాజ్‌వాదీ పార్టీ
8. ఆర్జేడీ
9. సీపీఐ(ఎం)
10. సీపీఐ
11. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
12. ఆర్ఎస్పీ
13. పీడీపీ
14. ఎండీఎంకే
15. కేరళ కాంగ్రెస్ (ఎం)
16. ఏఐయూడీఎఫ్