Farmers Protest: విజ్ఞాన్ భవన్‌లో నేడు కేంద్రం-రైతు సంఘాల మధ్య 11వ విడత చర్చలు.. ఈసారైనా తేలేనా..!?

|

Jan 22, 2021 | 10:11 AM

Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేతులు ఆందోళనలు చేపట్టి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా..

Farmers Protest: విజ్ఞాన్ భవన్‌లో నేడు కేంద్రం-రైతు సంఘాల మధ్య 11వ విడత చర్చలు.. ఈసారైనా తేలేనా..!?
Follow us on

Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేతులు ఆందోళనలు చేపట్టి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందనా రావడం లేదు. చట్టాలకు సంబంధించి కేంద్రం, రైతుల మధ్య 10 దఫాలుగా చర్చలు జరిగినా.. ఫలితం లేకుండాపోయింది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి సమావేశం నిష్ప్రయోజనంగానే మిగిలిపోయాయి. అయితే, ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్రం-రైతులు సంఘాల మధ్య 11వ విడత చర్చలు జరగనున్నాయి. రైతుల చట్టాల అమలు, ఎంఎస్‌పీ తదితర అంశాలపై నేటి సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

కాగా, ఇప్పటికే ఏడాదిన్నర వరకు చట్టాలను అమలు చేయబోమని, సంయుక్త కమిటీ వేసి చర్చించేందుకు సిద్ధమని కేంద్ర ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. గురువారం నాడు ఢిల్లీ సరిహద్దు సింఘు వద్ద సమావేశమైన రైతు సంఘాలు.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను ముక్తకంఠంతో తిరస్కరించాయి. కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.

Also read:

ఇక్కడ క్రికెట్‌ అంటే ఆట మాత్రమే కాదు.. అంతకన్నా ఎక్కువ అంటున్న.. ఇండియన్ మాజీ డాషింగ్ ఓపెనర్..

Prabhas’s Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని భయం