ఆలయంలో భారీ కింగ్‌ కోబ్రా ప్రత్యక్షం.. షాక్ తిన్న భక్తులు..

| Edited By:

Jul 08, 2020 | 12:23 PM

ఒడిషాలోని ఓ దేవాలయంలో అకస్మాత్తుగా కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. దీంతో అక్కడ ఉన్న భక్తులు ఒకకసారిగా షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లాలోని జరడా జగన్నాథ స్వామి ఆయల ప్రాంతంలో..

ఆలయంలో భారీ కింగ్‌ కోబ్రా ప్రత్యక్షం.. షాక్ తిన్న భక్తులు..
Follow us on

ఒడిషాలోని ఓ దేవాలయంలో అకస్మాత్తుగా కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. దీంతో అక్కడ ఉన్న భక్తులు ఒకకసారిగా షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లాలోని జరడా జగన్నాథ స్వామి ఆయల ప్రాంతంలో మంగళ వారం నాడు ఓ భారీ కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. ఇది చూసిన అక్కడి భక్తులు ఒక్కసారిగా కేకలు పెట్టారు. విషయాన్ని ఆలయ సిబ్బందికి, అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే.. స్థానిక పీపుల్ ఫర్ అనిమల్స్ (పీఎఫ్ఏ) సంస్థకు చెందిన సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ భారీ కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఫారెస్ట్ అధికారులతో కలిసి.. సమీప అడవుల్లో వదిలిపెట్టారు. పట్టుబడ్డ ఈ కింగ్ కోబ్రా పొడవు పది అడుగులకు పైగా ఉందని పీఎఫ్ఏ సభ్యులు తెలిపారు.